Tiger Nageswara Rao: మాస్ మహారాజ మూవీ కోసం వైజాగ్‌లో భారీ సెట్..

మాస్ మహారాజా నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది.

Tiger Nageswara Rao: మాస్ మహారాజ మూవీ కోసం వైజాగ్‌లో భారీ సెట్..
Ravi Teja
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2023 | 7:24 PM

మాస్ మహారాజ రవితేజ వరుసగా రెండు హిట్స్ అందుకున్నారు. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో చేసిన ధమాకా సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు రవితేజ. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించి మెప్పించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక త్వరలో రవితేజ మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. వాటిలో ఒకటే టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. వైజాగ్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ జరపనున్నారట. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందించనున్నాడు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో