Raviteja: జాతిరత్నాలు డైరెక్టర్‌కు మాస్ మాహారాజా రవితేజ గ్రీన్ సిగ్నల్.. ఇక థియేటర్లలో రచ్చే..
ప్రస్తుతం ఆయన డైరెక్టర్ మహేష్ తో టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా లెవల్లో ఈచిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తుంది. వచ్చే ఏడాది అక్టోబర్ లో విడుదల చేయనున్నారు.

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఈ ఏడాది ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన రావణాసుర సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయినప్పటికీ రవితేజ విలనిజం నటనపై ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ మహేష్ తో టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా లెవల్లో ఈచిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తుంది. వచ్చే ఏడాది అక్టోబర్ లో విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యువ దర్శకుడు అనుదీప్ కేవీతో ఓ మూవీ చేయనున్నాడట. వీరిద్దరి కాంబోలో ఓ క్రేజ్ ప్రాజెక్ట్ రానుందని టాక్ వినిపిస్తుంది. అనుదీప్ దర్శకత్వంలో రవితేజ టైమింగ్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.




జాతి రత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన అనుదీప్… తన సినిమాలో రవితేజను ఎలా చూపించబోతున్నారన్న ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.




