Sairat : వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..

ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ఆ లిస్ట్ లో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో సైరాట్ సినిమా ఒకటి. ఇది మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేస్తోంది.

Sairat : వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
Sairat
Follow us

|

Updated on: Jun 29, 2024 | 9:17 PM

సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. చిన్న సినిమాలుగా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ఆ లిస్ట్ లో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో సైరాట్ సినిమా ఒకటి. ఇది మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేస్తోంది.

2016లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు నాగరాజు మంజులే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కథ కుల వివక్షత గురించి తెలుపుతుంది. ఇక ఈ సినిమాలో ఆకాష్ థోసర్ హీరోగా.. రింకు రాజ్‌గురు హీరోయిన్ గా నటించారు. ముఖ్యంగా రింకు రాజ్‌గురు తన నటనతో ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు.

రింకు కన్నడలోనూ పలు సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఝుండ్‌తో సినిమా హిందీలోకి అడుగు పెట్టింది రింకు. అలాగే లారాదత్తాతో కలిసి హండ్రెడ్ అనే ఓటీటీ మూవీ కూడాచేసింది . ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అని అంతా ఆసక్తిగా నెట్టింట గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రింకు ఇప్పుడు చాలా మారిపోయింది. సైరాట్ సినిమా సమయంలో ఆమె వయసు చాలా తక్కువ.. అప్పుడు క్యూట్ గా కనిపించిన రింకు.. ఇప్పుడు గ్లామరస్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయండి.

రింకు రాజ్ గురు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.