“నాన్న ఇక చాలు చచ్చిపో”.. బ్రతికుండగానే కన్నతండ్రిని చనిపోమన్న స్టార్ నటుడు

సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మనోజ్ బాజ్ పాయ్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు. 

నాన్న ఇక చాలు చచ్చిపో.. బ్రతికుండగానే కన్నతండ్రిని చనిపోమన్న స్టార్ నటుడు
Manoj Bajpayee
Follow us

|

Updated on: May 15, 2024 | 9:05 AM

అమ్మ, నాన్న ఈ ఇద్దరినీ మించిన దైవం ఉండదు.. తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ ఓ నటుడు మాత్రం తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని అన్నాడు. ఆ మాట అన్నందుకు ఎంతో కుమిలిపోయాడు. ఇంతకు ఆ స్టార్ నటుడికి అంత కష్టం ఏం వచ్చింది.? కన్న తండ్రి మరణాన్ని ఎందుకు కోరుకున్నాడు. బ్రతికుండగానే ఎందుకు చనిపోమని అన్నాడు.? సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మనోజ్ బాజ్ పాయ్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు.

టాలీవుడ్ లో ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ బాజ్ పాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని చెప్పానని అన్నారు.

‘ఒకరోజు సినిమా షూటింగ్ లో ఉండగా తన సోదరి ఫోన్ చేసి.. నాన్న ఇక మనకు లేనట్టే.. ఆయన బ్రతకడం కష్టం అంటున్నారు. ఆయన జీవితం ముగిసింది అని చెప్పింది. దాంతో నేను షాక్ అయ్యాను. ఆయన చనిపోయారా అని అడిగాను. లేదు ఆయన ఇంకా చనిపోలేదు.. కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు.. నొప్పిని భరించలేకపోతున్నారు అని చెప్పింది. అప్పుడు నేను ‘కిల్లర్ సూప్’ వెబ్ సిరీస్ సెట్స్ లో ఉన్నాను. వెంటనే వ్యాన్ లోకి వెళ్లి మా నాన్నతో ఫోన్ లో మాట్లాడాను.. నాన్న.. నొప్పి భరించింది చాలు నాన్న..  అందరినీ వదిలి వెళ్లే సమయం వచ్చింది చనిపోండి.. దయచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో.. అని అన్నాను. ఆ తర్వాత నేను ఎంతో కుమిలిపోయాను. గుండె బద్దలయ్యేలా ఏడ్చాను.. అది చూసి నా పక్కన ఉన్న బాయ్ కూడా ఏడ్చాడు. ఆతర్వాతి రోజే మా నాన్న చనిపోయారు అని తెలిపారు మనోజ్. నా తండ్రి మరణం నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన అని అన్నారు మనోజ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ