AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manisha Koirala: ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్.. కానీ ఆ పాట షూటింగ్ చేయాలంటే భయపడ్డ హీరోయిన్.. ఎందుకంటే..

ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. శేఖర్ పాత్రలో అరవింద్ స్వామి, షైలా భాను పాత్రలో మనీషా కోయిరాల నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి యాక్టింగ్‏తో వెండితెరపై మెరుపులు మెరిపించారు. ఈ సినిమాకు ప్రధాన బలం అంటే సంగీతమే అని చెప్పాలి.

Manisha Koirala: ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్.. కానీ ఆ పాట షూటింగ్ చేయాలంటే భయపడ్డ హీరోయిన్.. ఎందుకంటే..
Urike Chilaka Song
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2024 | 11:22 AM

Share

“ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు

కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు

చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను

ఇవి కూడా చదవండి

బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను.. ”

సాంగ్ ఇప్పటికీ శ్రోతల హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. ఒకప్పుడు యూత్‏ను అల్లాడించేసిన ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఎంతో మంది మనసులను మైమరపించిన అద్భుతమైన సంగీతం. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన బొంబాయి చిత్రంలోనిది ఈ సాంగ్. తమిళ్ హీరో అరవింద్ స్వామి, మనీషా కోయిరాల జంటగా నటించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. శేఖర్ పాత్రలో అరవింద్ స్వామి, షైలా భాను పాత్రలో మనీషా కోయిరాల నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి యాక్టింగ్‏తో వెండితెరపై మెరుపులు మెరిపించారు. ఈ సినిమాకు ప్రధాన బలం అంటే సంగీతమే అని చెప్పాలి.

ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం శ్రోతలను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ఉరికే చిలకా సాంగ్ ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్. కానీ ఇదే పాట తన కెరీర్‏లోనే అత్యంత కష్టమైన పాట అని చెబుతుంది హీరోయిన్ మనీషా కోయిరాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలిపింది. ఎంతో మందిని కట్టిపడేసిన ఈ పాట తనకు మాత్రం చాలా కష్టమైనదని తెలిపింది. ఈ సాంగ్ చిత్రీకరణ సముద్రం ఒడ్డున ఉన్న ఓ పురాతన కట్టడం వద్ద జరిగిందని.. అక్కడ పెద్ద పెద్ద రాళ్లు.. చుట్టూ ముళ్లపొదలు, చెట్లు ఉన్నాయని తెలిపింది.

ముఖ్యంగా ఆ ప్రదేశం మొత్తం జలగలే ఉన్నాయని.. ఆ పాటలో తాను పొడవాటి నీలిరంగు దుస్తులు పరుగెత్తాలి.. కానీ కాలు కింద పెడితే ఎక్కడ జలగలు తనను పట్టిస్తాయేమోనని భయపడ్డానని.. దీంతో తన పరిస్థితిని అర్థం చేసుకున్న చిత్రయూనిట్.. ఆ ప్రదేశంలో ఉప్పు చల్లారని.. అలాగే తనకు బూట్లు కూడా ఇచ్చారని తెలిపింది. అలా చేయడం ద్వారా ఈ సాంగ్ షూటింగ్ కాస్త సులభమైందని అప్పటి సంగతులను గుర్తుచేసుకుంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మనీషా.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టా్ర్ట్ చేసింది. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్ లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us