AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maro Charitra Movie: అయ్యా బాబోయ్.. వరుణ్ సందేశ్ ‘మరో చరిత్ర’ హీరోయిన్ ఇలా మారిందేంటీ..? చూస్తే మైండ్ బ్లాంకే..

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం మొదటి షో నుంచి ప్రతికూల స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇందులో వరుణ్ సందేశ్ సరసన అనిత గ్యాలర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీలో కథానాయికగా కనిపించిన అనిత గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.

Maro Charitra Movie: అయ్యా బాబోయ్.. వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' హీరోయిన్ ఇలా మారిందేంటీ..? చూస్తే మైండ్ బ్లాంకే..
Maro Charitra Movie
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2024 | 12:20 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రెటీలకు, అభిమానులకు మధ్య వారధిలా మారింది. ఇప్పుడు తమ అభిమాన తారల గురించి నేరుగా నెట్టింట అడిగి తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాగే తమ ఫేవరేట్ స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. అలాగే సినీరంగుల ప్రపంచంలో ఒక్క సినిమాతోనే ఫాలోయింగ్ సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన తారల గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమైన తారలు ఇప్పుడు నెట్టింట తెగ హడావిడి చేస్తున్నారు. గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ షాకిస్తున్నారు. అందులో అనిత గాలర్. ఈ బ్యూటీ అంతగా ఎవరికీ తెలియదు. ఇక ఈ అమ్మడు నటించిన సినిమా మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా..? అదేనండి.. ఆల్ టైమ్ హిట్ విషాద ప్రేమకథ మరో చరిత్ర. 1978 విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే పేరుతో 2010లో వచ్చిన మరో చరిత్ర సినిమా మాత్రం విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది.

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం మొదటి షో నుంచి ప్రతికూల స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇందులో వరుణ్ సందేశ్ సరసన అనిత గ్యాలర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీలో కథానాయికగా కనిపించిన అనిత గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. అనితా లుక్స్ గురించి ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఈమూవీ తర్వాత అనిత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. అలాగే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

అనితా అమెరికాలో సెటిల్ అయిన అమ్మాయి. ఇక మరో చరిత్ర సినిమా కూడా అమెరికాలోనే తెరకెక్కించడంతో యూఎస్ లో స్థిరపడ్డ అమ్మాయిని కథానాయికగా తీసుకున్నారు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మరో సినిమా చేయలేదు అనితా. కానీ ప్రస్తుతం అమెరికన్ టెలివిజన్లలో హోస్టుగా వ్యవహరిస్తుంది. రెండేళ్ల క్రితం జోషువా మాలేక్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తుంది. మరో చరిత్ర సినిమా కంటే ఇప్పుడు పూర్తిగా సన్నబడి ఊహించని లుక్ లో కనిపిస్తుంది అనితా..ఇటీవలే 35 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టింది. కానీ ఇప్పటికీ 25 ఏళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. ప్రస్తుతం అనిత ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us