AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Ashwin: ‘ప్రభాస్‌ కూడా ఇదే మాట అంటుంటారు’.. అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలపై నాగ అశ్విన్‌ రియాక్షన్‌

బాలీవుడ్ నటుడు అర్షద్‌ వార్సీ.. ప్రభాస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 'క‌ల్కి 2898 ఏడీ' చిత్రంలో ప్రభాస్‌ గెట‌ప్ జోక‌ర్‌ను తలపించింది అంటూ చేసిన వ్యాఖ్యలను సెలబ్రిటీలు సైతం ఖండించారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రభాస్‌కు అండగా నిలిచారు. ఇండియన్‌ సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించిన...

Nag Ashwin: 'ప్రభాస్‌ కూడా ఇదే మాట అంటుంటారు'.. అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలపై నాగ అశ్విన్‌ రియాక్షన్‌
Nag Ashwin
Narender Vaitla
|

Updated on: Aug 24, 2024 | 11:13 AM

Share

బాలీవుడ్ నటుడు అర్షద్‌ వార్సీ.. ప్రభాస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘క‌ల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్‌ గెట‌ప్ జోక‌ర్‌ను తలపించింది అంటూ చేసిన వ్యాఖ్యలను సెలబ్రిటీలు సైతం ఖండించారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రభాస్‌కు అండగా నిలిచారు. ఇండియన్‌ సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించిన ప్రభాస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై కల్కి దర్శకుడు నాగ అశ్విన్‌ సైతం స్పందించారు. ‘కల్కి’ సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్ట్‌ చేసిన నెటిజన్‌.. ఈ ఒక్క సీన్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తంతో సమానం అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై నాగ్‌అశ్విన్‌ స్పందిస్తూ.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని విడదీసి మాట్లాడొద్దన్నారు. అలాగే టాలీవుడ్ వర్సెస్‌ బాలీవుడ్‌ అంటూ పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దని అన్నారు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమేనని నాగ అశ్విన్‌ స్పష్టం చేశారు.

ఇక అర్షద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన కాస్త హుందాగా మాట్లాడి ఉండాల్సిందని అన్నారు. అయితే మాకేం పర్వాలేదని, అర్షద్ పిల్లల కోసం తాము ‘కల్కి’ బుజ్జి బొమ్మలు పంపిస్తామని తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. ఇక కల్కి రెండో భాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తానని, ప్రభాస్‌ను మరింత బెస్ట్‌గా చూపిస్తానని నాగ అశ్విన్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు, కానీ మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభాస్‌ కూడా ఇదే మాట అంటుంటారని నాగ అశ్విన్‌ చెప్పుకొచ్చారు.

టాప్‌లో ప్రభాస్‌..

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్​ ఇన్​ ఇండియా జాబితాలో జులై నెలకుగానూ ప్రభాస్‌ అగ్ర స్థానంలో నిలిచారు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్​, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసి మరి ముందంజలో నిలిచారు ప్రభాస్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..