AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్.. థ్యాంక్యూ’.. కుమారుడి పుట్టిన రోజున మౌనిక ఎమోషనల్

టాలీవుడ్‌ రాక్ స్టార్ హీరో మంచు మనోజ్‌ భార్య మౌనికా రెడ్డి ఇప్పుడు సంతోషంలో తేలియాడుతోంది. మంచు మనోజ్ తో కలిసి ఇటీవలే ఓ పండంటి ఆడ బిడ్డకు మౌనిక జన్మనిచ్చింది. ఆమెకు దేవసేన ఎమ్‌ఎమ్‌ పులి అని పేరు కూడా పెట్టారు. మౌనికకు దేవ సేన కంటే ముందే ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనతో బిజి బిజీగా ఉంటోంది మౌనిక. గురువారం (ఆగస్టు 01) మొదటి కుమారుడు ధైరవ్ పుట్టిన రోజు

Manchu Manoj: 'నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్.. థ్యాంక్యూ'.. కుమారుడి పుట్టిన రోజున మౌనిక ఎమోషనల్
Manchu Manoj Family
Basha Shek
|

Updated on: Aug 01, 2024 | 4:43 PM

Share

టాలీవుడ్‌ రాక్ స్టార్ హీరో మంచు మనోజ్‌ భార్య మౌనికా రెడ్డి ఇప్పుడు సంతోషంలో తేలియాడుతోంది. మంచు మనోజ్ తో కలిసి ఇటీవలే ఓ పండంటి ఆడ బిడ్డకు మౌనిక జన్మనిచ్చింది. ఆమెకు దేవసేన ఎమ్‌ఎమ్‌ పులి అని పేరు కూడా పెట్టారు. మౌనికకు దేవ సేన కంటే ముందే ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనతో బిజి బిజీగా ఉంటోంది మౌనిక. గురువారం (ఆగస్టు 01) మొదటి కుమారుడు ధైరవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మనోజ్, తన కుమారుడితో కలిసున్న మధుర క్షణాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్న మౌనిక.. ‘ హ్యాపీయెస్ట్ బర్త్ డే.. నీ ప్రేమ, ఎనర్జీ, నవ్వు.. అన్నీ ప్రతి రోజూ నన్ను మరింత బెటర్ గా మారుస్తున్నాయి. నా లైఫ్ లోకి వచ్చినందుకు థాంక్యూ. నువ్వు ఇంకా మరెన్నో అందమైన బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు నా ఫస్ట్ చీర్‌ లీడర్‌. నువ్వు నన్ను చూస్తూ ఉండిపోయినప్పుడు ఎంత ముద్దొస్తావో! అప్పుడు నేను కూడా పసిపాపనై పోతాను. నా జీవితాన్ని ఇంత అందంగా మలచినందుకు చాలా థ్యాంక్స్. నీకు అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మనోజ్‌, నేను నీ వెంటే నిలబడతాం. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని, జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కుమారుడిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది మౌనిక.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ సతీమణి షేర్ చేసిన ఈ పోస్ట్, అందులోని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన మనోజ్‌ అభిమానులు, నెటిజన్లు ధైరవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు మంచు మనోజ్. వాట్ ది ఫిష్ అనే సినిమాలో హీరోగా నటిస్తోన్న మనోజ్, మిరాయ్‌లో నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. త్వరోలనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మౌనిక ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కూతురి బారసాల వేడుకలో మనోజ్, మౌనిక..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?