AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘హనుమంతు.. అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను’.. మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరలవుతోంది. అందులో కొంత మంది ఆకతాయిలు ఇన్ స్టాగ్రాం వీడియో కాల్‌లో మీట్ అయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. అడ్డదిడ్డంగా కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. చిన్న పిల్లలు, తండ్రీ కూతుళ్లు అనే వావివరసలు మర్చిపోయి నీచమైన కామెంట్స్ చేస్తున్నారు.

Manchu Manoj: 'హనుమంతు.. అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను'.. మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్
Manchu Manoj
Basha Shek
|

Updated on: Jul 08, 2024 | 6:34 AM

Share

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరలవుతోంది. అందులో కొంత మంది ఆకతాయిలు ఇన్ స్టాగ్రాం వీడియో కాల్‌లో మీట్ అయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. అడ్డదిడ్డంగా కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. చిన్న పిల్లలు, తండ్రీ కూతుళ్లు అనే వావివరసలు మర్చిపోయి నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు చాలా ట్రెండ్ అవ్వడంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ముందుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ వీడియోపై స్పందించాడు. సోషల్‌ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత రోజుల్లో సామాజిక మాధ్యమాలు చాలా భయానకంగా మరాయని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ట్వీట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క సైతం స్పందించారు. పసి పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా చిన్న పిల్లల భద్రతపై మరో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఘాటుగా స్పందించారు.

‘చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇలా నీచంగా వీడియోలు చేసే వారి ప్రవర్తన సహించరానిది. ఫన్, వినోదం ముసుగులో జరుగుతున్న ఇలాంటి దారుణాలు చాలా ప్రమాదకరం. సుమారు ఏడాది క్రితం ఏపీ, తెలంగాణలో చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించాను. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు చూస్తే అతను పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. మన పిల్లలు, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దయచేసి ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను’ అంటూ ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.