AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న సింగర్‌కు ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలిచ్చారో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. సినిమాలు వేగంగా కంప్లీట్ చేయడంలో ఈ సీనియర్ హీరో దిట్ట. ఏడాదికి కనీసం 2-3 సినిమాలనైనా రిలీజ్ చేస్తుంటాడు అక్షయ్. ఇక ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఒకరు

Akshay Kumar: అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న సింగర్‌కు ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలిచ్చారో తెలుసా?
Akshay Kumar
Basha Shek
|

Updated on: Jul 07, 2024 | 12:47 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. సినిమాలు వేగంగా కంప్లీట్ చేయడంలో ఈ సీనియర్ హీరో దిట్ట. ఏడాదికి కనీసం 2-3 సినిమాలనైనా రిలీజ్ చేస్తుంటాడు అక్షయ్. ఇక ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. సినిమాల సంగతి పక్కన పెడితే.. అక్షయ్ కుమార్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. ఓ ప్రముఖ సింగర్ కష్టాల్లో ఉందని తెలుసుకున్న ఆయన ఏకంగా రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేశారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు అక్షయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కి చెందిన పద్మ భూషణ్ అవార్డు గ్రహిత సింగర్ గుర్మీత్ బవా కూతురు గ్లోరీ బవా. తల్లి మరణించాక ఈమె ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే తాను ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. గ్లోరీ కూడా సింగర్ కావడంతో ఆమె పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్ కూడా ఈ పోస్టును చూసి వెంటనే స్పందించాడు. గ్లోరీ బవాకు ఏకంగా 25 లక్షలు సహాయం చేశాడు.

గుర్మీత్ బవా ఫ్యామిలీ కష్టాల్లో ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. గుర్మీత్ బవా పంజాబ్‌లో గొప్ప సింగర్. నేను కూడా ఆమె పాటలు వినేవాడిని. ఆమె కూతురు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని తెలిసి బాధపడ్డాను. అందుకే ఒక అన్నయ్యగా ఆమెకు సహాయం చేశాను’ అని అక్షయ కుమార్ తెలిపాడు. ఇక హీరో చేసిన సాయంపై గ్లోరీ బవా కూడా స్పందించింది. ‘ అక్షయ్ కుమార్ చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ఇవి కూడా చదవండి

ఇక బాలీవుడ్ హీరో చేసిన సహాయంపై గ్లోరీ బవా మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ చేసిన సహాయం నేను మర్చిపోలేను. మా అమ్మ పాటలు ఆయన విని ఉంటారు. అన్నయ్యగా నాకు ఈ సహాయం చేస్తానని తెలిపారు. నేను ఆయనకు రాఖీ కట్టి నిజంగానే అన్నయ్యని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో నా ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. నేను పని చేసుకుని బతుకుతాను’ అని చెప్పుకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్ మంచి మనసుకి అందరూ ఫిదా అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?