OTT Move: 15 రోజులుగా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దొంగ బాబా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులోనంటే?
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా 'మహారాజ్'. విడుదలకు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదల చేయకూడదని హిందూత్వ వాదులు ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. దీంతో మొదట ఈ సినిమాను రిలీజ్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా ‘మహారాజ్’. విడుదలకు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదల చేయకూడదని హిందూత్వ వాదులు ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. దీంతో మొదట ఈ సినిమాను రిలీజ్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి క్లియరెన్స్ ఇవ్వడంతో సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అది కూడా డైరెక్టుగా ఓటీటీలోనే. మహరాజ్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 22న ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ మహరాజ్ సినిమా ఓటీటీలో రికార్డులు కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఇండియా లోనే నెంబర్ 1 సినిమా ట్రెండింగ్ అవుతుండగా గ్లోబల్ గా కూడా ఏకంగా 22 దేశాల్లో మహరాజా ట్రెండ్ అవుతుందట. ఇది కాకుండా గత వారం రోజుల ఛార్ట్స్ లో అయితే ఈ సినిమాకి నెట్ ఫిక్స్ లో ఏకంగా 5.3 మిలియన్ వ్యూస్ వచ్చాయట. దీనిని బట్టి చూస్తే ఓటీటీలో మహరాజ్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సౌరభ్ షా రచించిన ‘మహారాజ్’ పుస్తకం ఆధారంగా మహరాజ్ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దైవ సన్నిధిలో ఉంటూ భగవంతునితో సమానంగా సేవలు అందుకునే ఓ దొంగ బాబా ఆడవాళ్లపై చేసిన అకృత్యాలు, వాటి వల్ల నష్టపోయిన ఓ యువ జర్నలిస్ట్ చేసిన పోరాటం ఇతివృత్తంగా ఈ మూవీ నడుస్తోంది. ఇందులో దొంగ బాబా పాత్రలో ‘పాతాల్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ నటించాడు. అలాగే యువ జర్నలిస్ట్ గా ఆమీర్ ఖాన కొడుకు జునైద్ ఖాన్ నటించాడు. అలాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే కూడా ఓ కీలక పాత్రలో మెరిసింది. వాస్తవిక సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చూడాలనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Based on true events from the 1860s – Maharaj is now streaming, only on Netflix. pic.twitter.com/QlleHUV8dq
— Netflix India (@NetflixIndia) June 22, 2024
తెలుగులోనూ అందుబాటులోకి..
“सवाल ना पूछ सके वो भक्त अधूरा और जवाब ना दे सके वो धर्म”
‘મહારાજ’ ફિલ્મ સારી છે, પણ વ્યાભિચાર અને એ સમયના સમાજ સુધારક કરસન મુળજીના સંઘર્ષ પર લખેલા પુસ્તકની સામે ૨ કલાકની ફિલ્મ નાની લાગી. પણ દરેક લોકોએ ખાસ જોવી જોઈએ.#Maharaj #JunaidKhan #Netflix @hisaurabhshah pic.twitter.com/2rBCOypliQ
— Vikas (@Vikass_Leuva) June 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.