- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Maanas Nagulapalli wife Srija Nissankara Baby Shower Function Photos
Maanas Nagulapalli: గ్రాండ్‌గా ‘బ్రహ్మముడి’ మానస్ భార్య సీమంతం.. ఫొటోస్ చూశారా?
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగుల పల్లి త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య శ్రీజ మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మానస్ భార్య సీమంతం ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది
Updated on: Jul 05, 2024 | 10:47 PM

బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగుల పల్లి త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య శ్రీజ మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మానస్ భార్య సీమంతం ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.

కాగా వారం క్రితమే శ్రీజ సీమంతం జరిగింది. అయితే మానస్ మాత్రం ఇప్పుడు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రస్తుతం శ్రీజ సీమంతం ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా గతేడాది నవంబర్ లో మానస్-శ్రీజల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. పలువురు ప్రముఖులు వీరి పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

కెరీర్ ప్రారంభంలో కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు మానస్. అలాగే కొన్ని మూవీస్ లో స్పెషల్ రోల్స్ కూడా పోషించాడు.

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ అడుగుపెట్టిన ఈ హ్యాండ్సమ్ యాక్టర్ బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు.




