Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. అలా అనేసిందేంటి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సామ్ సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు

Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. అలా అనేసిందేంటి?
Samantha, Poonam Kaur
Follow us
Basha Shek

|

Updated on: Jul 06, 2024 | 9:15 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సామ్ సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు. అంతేకాదు సామ్ ను నిరక్షరాస్యులిగా అభివర్ణించాడు. ఇలాంటి సలహాలు ఇస్తోన్న సామ్ ను జైలుకు పంపాలంటూ కూడా డిమాండ్ చేశాడు. దీనికి వంత పాడుతూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా సామ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్‌ బాధ్యత తీసుకుంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా సామ్ పై విమర్శలు కురిపించింది జ్వాల.

తాజాగా మరో ప్రముఖనటి పూనమ్ కౌర్ కూడా సమంత ఆరోగ్య చిట్కాపై స్పందించింది. జ్వాల ట్వీట్ కు రిప్లై ఇచ్చిన ఆమె.. ‘ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనే దానికి ఉదాహరణ. చాలా మంది ప్రముఖులు చక్కెర తీసుకోరు. కానీ వారు తీసుకోని చక్కెర ఉన్న పానీయాలు, చాక్లెట్ల గురించి విచ్చల విడిగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా డార్క్ రియాలిటీ’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం గుత్తా జ్వాల, పూనమ్ కౌర్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. చాలా మంది నెటిజన్లు వీరిని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్