Raj Tarun: లావణ్య ఎక్కడుంది.? హీరో రాజ్ తరుణ్ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. పూర్తి వివరాలు
లావణ్య లా పతా? కంప్లైంట్ ఇచ్చిన తరువాత ఆమె కన్పించకపోవడం వెనుక మతలబు ఏంటి? సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని.. మాల్వీ మల్హోత్రా అండ్ ఫ్యామిలీ నుంచి తనకు థ్రెట్ ఉందని..
లావణ్య లా పతా? కంప్లైంట్ ఇచ్చిన తరువాత ఆమె కన్పించకపోవడం వెనుక మతలబు ఏంటి? సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని.. మాల్వీ మల్హోత్రా అండ్ ఫ్యామిలీ నుంచి తనకు థ్రెట్ ఉందని.. లావణ్య ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులకు ఆమెకు నోటీసులు ఇవ్వడం లేటెస్ట్ అప్‌డేట్. ఇక మరో ట్విస్ట్ కూడా వుంది. అదే లావణ్యపై నటి మాల్వీ మల్హోత్రా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం.
రాజ్ తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయితో లావణ్య రిలేషన్ షిప్‌లో ఉందంటూ సంచలన ఆరోపణ చేశాడు రాజ్ తరుణ్. ఇక లేటెస్ట్‌గా మాల్వీ మల్హోత్రా ఫ్రేమ్‌లోకి వచ్చింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ లావణ్యపై కంప్లైంట్ ఇచ్చిందామె. అసలు కథ ఏంటో కానీ కంప్లైంట్ మీద కంప్లైంట్‌తో సహజీవన కథా చిత్రమ్ రసవత్తర టర్న్‌లు తీసుకుంటోంది. 11 ఏళ్ల లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ ఎందుకు బీటలు వారె? ఊయ్యాలా జంపాల అన్నట్టుగా ఒకే ఇంట్లో పై పోర్షన్‌లో ఆమె.. గ్రౌండ్ ఫ్లోర్‌లో అతను.. సహజీవన బంధం సడెన్‌గా ఎందుకు బ్రేకపాయె? క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన కృతజ్ఞత భావం అతనికి ఉండగా.. అంత వెన్నుదన్నుగా వుండి ఆల్ ఆఫ్ సడెన్‌గా అతనిపైనే కంప్లైంట్ ఇవ్వనేలా? లావణ్య కంప్లైంట్ ద్వారా సహజీవన ముచ్చట బయటకు వచ్చింది. ఔను మేం కలిసి వున్నాం. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు కాదని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. డ్రగ్స్ కేసులో లావణ్య ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ ముచ్చటే ఇద్దరి మధ్య డిఫెరెన్సెన్స్‌కు కారణమైందా? డ్రగ్స్ ఒక్కటే కాదు ఆమె మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉందని.. కొన్ని సంచలనాలను తెరపైకి తెచ్చాడు రాజ్ తరుణ్.
ఇక లావణ్యది మరో వెర్షన్. తనను మోసం చేశాడని నార్సింగ్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చిందామె. 11 ఏళ్లు కలిసి వున్నాం. కష్ట సమయంలో అతనికి అండగా వున్నా. కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు అతను ముఖం చాటేశాడు. అందుకు కారణం మాల్వీ మల్హోత్రా. తనను రాజ్‌తరుణ్‌ను దూరం చేయాలని మాల్వీ మల్హోత్రా ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించారని.. తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారామె. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని వుందని.. రక్షణ కల్పించాలని కూడా విజ్క్షప్తి చేసింది లావణ్య. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ స్పందించాడు. ఆమె తనను ఎంతలా టార్చర్ చేసేదో చెప్పాడు. ఎప్పుడో పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాను.. కానీ ఇమేజ్ డ్యామేజ్ అవుతందని తనను తాను కంట్రోల్ చేసుకున్నట్టు చెప్పాడు. ఇక టార్చర్ భరించలేక తాను పోలీసులను అప్రోచ్ అవుదామని ఆలోచిస్తున్న తరుణంలో తనకన్నా ముందే లావణ్య పావులు కదిపిందన్నాడు. తమ మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలు.. మస్తాన్ సాయితో ఆమె రిలేషన్ షిప్.. డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్.. ప్రతీ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానన్నాడు. ఇక కథ ఇందాక వచ్చింది కాబట్టీ న్యాయపోరాటానికి కూడా తాను సిద్ధమన్నాడు.
రాజ్ తరుణ్.. కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? ఎప్పుడు? ఏమని?…ఈ ప్రశ్నల సంగతి ఎలా వున్నా తిరగబడే సామీ అన్నట్టుగా లావణ్య కంప్లైంట్ కథ చిత్రమ్ మరో టర్న్ తీసుకుంది. ఫిర్యాదులో ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని లావణ్యను కోరారు పోలీసులు. కానీ కంప్లైంట్ ఇచ్చాక ఆమె ఖాకీలకు కనపడలేదు. కనీసం వినపడలేదు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో వాట్సాప్‌లో నోటీస్ ఇచ్చారు. రాజ్ తరుణ్ వ్యవహారం సహా మాల్వీ మల్హోత్రా ఆమె కుటుంసభ్యులు బెదిరించారనే ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలన్నారు. గడువు 48 గంటలు. ఈలోపు లావణ్య రెస్పాండ్ అవుతుందా? తను చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను పోలీసులకు సమర్పిస్తుందా? లేదంటే కంప్లైంట్ తిరగబడినట్టేనా?.. ఏమో గుర్రం ఎటైనా తిరగబడనూ వచ్చు.. అనే టాక్ విన్పిస్తోందిప్పుడు.
ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి