Bigg Boss Telugu 8: బర్రెలక్క, హేమతో సహా ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ వీరే.. హౌజ్‌లో రచ్చ మాములుగా ఉండదు

ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆది రెడ్డి లాంటి బిగ్ బాస్ విశ్లేషకుల నుంచి కూడా తరచూ ఏదో ఒక లీక్స్ వస్తూనే ఉన్నాయి.

Bigg Boss Telugu 8: బర్రెలక్క, హేమతో సహా ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ వీరే.. హౌజ్‌లో రచ్చ మాములుగా ఉండదు
Bigg Boss Telugu Season 8
Follow us
Basha Shek

|

Updated on: Jul 06, 2024 | 8:18 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షో మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆది రెడ్డి లాంటి బిగ్ బాస్ విశ్లేషకుల నుంచి కూడా తరచూ ఏదో ఒక లీక్స్ వస్తూనే ఉన్నాయి. కాగా ఈసారి పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు బిగ్ బాస్ హౌజ్ లోకి రానున్నారని సమాచారం. అలాగే గత ఏడాది కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలను కూడా హౌజ్ లోకి రప్పించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లేడీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి జైలు కెళ్లిన హేమ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయిన కుమారీ ఆంటీ ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ గా రావచ్చని సమాచారం.

ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోన్న మరో పేరు అమృతా ప్రణయ్. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రే స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు. దీంతో తండ్రిపైనే కేసు పెట్టిందామె. తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచిన అమృతా ప్రణయ్ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. వీరితో పాటు సురేఖా వాణి, జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి, బ్రహ్మముడి కావ్య ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. అలాగనీ వీటిలో నిజం లేకపోలేదు. అయితే కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

శివాజీ కూడా.. కంటెస్టెంట్ గా కాదండోయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.