Sai Dharam Tej: సోషల్ మీడియాలో మృగాలు ఉన్నాయ్ జాగ్రత్త.. తల్లిదండ్రులకు సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తి

విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్. ఈ సినిమా కూడా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. అలాగే సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు.

Sai Dharam Tej: సోషల్ మీడియాలో మృగాలు ఉన్నాయ్ జాగ్రత్త.. తల్లిదండ్రులకు సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తి
Sai Dharam Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 07, 2024 | 12:48 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత తేజ్ స్పీడ్ తగ్గించాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్. ఈ సినిమా కూడా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. అలాగే సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవలే మావయ్య పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ ఆనందంలో తేజ్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజ్ తాజాగా తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా మారింది అని తేజ్ అభిప్రాయపడ్డాడు. ” సోషల్ మీడియా చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. దయ చేసి జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు, లేదా  వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి.. అలాగే పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇది నా అభ్యర్థన. దయచేసి సోషల్ మీడియాలో ఉండే జంతువులను ప్రమాదకరంగా మార్చకండి. దయచేసి మీ పిల్లలఫోటోలను లేదా వీడియోలను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు. మిమ్మల్ని ఎంతగానో బాధపెడతాయి ఆ కామెంట్స్.. మీ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడం మంచిది అని నా భావన. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్. ఈ పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tej

సాయి ధరమ్ తేజ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..