Payal Rajput: ‘ఆ హీరో ఇంటే చాలా ఇష్టం.. ఏదడిగినా చేసిపెడతా’.. మనసులో మాట బయటపెట్టిన పాయల్ రాజ్‌పుత్

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో రివ్వున టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా సినిమా అవకాశాలు కూడా సొంతం చేసుకుంది. అయితే సక్సెస్ మాత్రం ఆర్ ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయింది

Payal Rajput: 'ఆ హీరో ఇంటే చాలా ఇష్టం.. ఏదడిగినా చేసిపెడతా'.. మనసులో మాట బయటపెట్టిన పాయల్ రాజ్‌పుత్
Payal Rajput
Follow us
Basha Shek

|

Updated on: Jul 07, 2024 | 12:20 PM

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో రివ్వున టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా సినిమా అవకాశాలు కూడా సొంతం చేసుకుంది. అయితే సక్సెస్ మాత్రం ఆర్ ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయింది. చాలా రోజులకు గానీ ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేదీ అందాల తార. ఇటీవల రక్షణ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఇలియానా, అనుష్కశెట్టి అంటే ఇష్టం. హీరోల్లో పవన్ ‌కళ్యాణ్‌ సినిమాలు ఎక్కువగా చూస్తాను. అవకాశం వస్తే మహేశ్‌బాబు, ప్రభాస్‌ సినిమాల్లో నటించాలని ఉంది. ప్రభాస్‌ నా ఫేవరెట్‌. ఆయనకు లంచ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. తను ఏది అడిగితే అది చేసిపెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్‌ అంటే నాకు చాలా చాలా ఇష్టం. దాన్ని నేనే స్పెషల్‌గా వండి నా చేత్తో హీరో ప్రభాస్‌కు తినిపించాలని ఉంది. అలాంటి ఛాన్స్‌ వస్తే మాత్రం అస్సలు వదులుకోను’ అని మనసులోని మాటను బయట పెట్టింది పాయల్ రాజ్ పుత్.

త్వరలోనే ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ రక్షణ

మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం రక్షణ. ఇప్పటివరకు ప్రేమ కథలు, లవ స్టోరీస్, నెగిటివ్ రోల్స్ సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్ మొదటి సారిగా ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. జూన్ 7 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రక్షణ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జులై 12 న లేదా 19 తేదీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావచ్చని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కించిన రక్షణ సినిమాలో బ్రహ్మముడి మానస్ విలన్ రోల్ లో మెప్పించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.