Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను చేసిన ఎదవపనికి ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు.. నన్ను తరిమి తమిరి కొట్టారు.. మనోజ్ కామెంట్స్

సుమారు ఎనిమిదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు రాక్ స్టార్ మంచు మనోజ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అతను నటించిన తాజా చిత్రం భైరవం. మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఈ సినిమాలో హీరోలుగా కనిపించారు. మే 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

నేను చేసిన ఎదవపనికి ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు.. నన్ను తరిమి తమిరి కొట్టారు.. మనోజ్ కామెంట్స్
Jr.ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2025 | 12:37 PM

చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లం కొండా సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. తమిళ్ సినిమా గరుడన్ సినిమాకు రీమేక్ గా భైరవం సినిమా విడుదలైంది. యాక్షన్ ఎంటైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. భైరవం సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ మనోజ్ హుషారుగా పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. భైరవం సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు.

గతంలోనూ మనోజ్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్, మనోజ్ మంది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగారు. అలాగే ఇద్దరి పుట్టిన రోజులు కూడా ఒక్కటే. కలిసి పెరిగారు. చిన్న తనంలో ఎంతో అల్లరి కూడా చేశారు. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తుచేసుకున్నారు. తాను చేసిన వెధవపని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడు అని తెలిపారు.

చిన్న తనంలో మేము ఐదో, ఆరో తరగతి చదువుతున్నాం.. ఓ పెళ్ళికి వెళ్ళాం. అక్కడ మేము ఓ ప్రయోగం చేశాం. ఒక బెలూన్ ను తీసుకొచ్చి.. దానికి మంట పెట్టాను.. అది కాస్తా ఎన్టీఆర్ చేతికి మంట అంటుకుంది. దాంతో ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు. ఎన్టీఆర్ ఏడుపు చూసి మా అమ్మమ్మ వచ్చి నన్ను చితక్కొట్టింది. మా అమ్మమ్మ ఆదిలక్షమ్మ.. బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టారు అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో మంచు లక్ష్మీ హోస్ట్ గా చేసిన ఓ షోలో ఎన్టీఆర్ కూడా మనోజ్ తో చేసిన అల్లరి గురించి మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. ఫోటోస్ చూస్తే కిర్రాక్ అంతే..
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. ఫోటోస్ చూస్తే కిర్రాక్ అంతే..
రాత్రి పూట సరిగా నిద్ర పట్టటం లేదా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
రాత్రి పూట సరిగా నిద్ర పట్టటం లేదా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
ఓటమి ఎరుగని ఆసీస్ త్రిమూర్తుల గర్వాన్ని దించిన బవుమా సేన
ఓటమి ఎరుగని ఆసీస్ త్రిమూర్తుల గర్వాన్ని దించిన బవుమా సేన
ప్రపంచ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రపంచ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
కళింగ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ వరకు.. విశాఖ పూర్తి చరిత్ర ఇదే..
కళింగ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ వరకు.. విశాఖ పూర్తి చరిత్ర ఇదే..
గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. లైవ్ వీడియో..
గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. లైవ్ వీడియో..
ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌!
ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌!
అద్దెకు తీసుకుని అంత పని చేశారు.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా
అద్దెకు తీసుకుని అంత పని చేశారు.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా
విమాన ప్రమాదంపై నోరుపారేసుకున్న డిప్యూటీ తహశీల్దార్‌‌కు షాక్!
విమాన ప్రమాదంపై నోరుపారేసుకున్న డిప్యూటీ తహశీల్దార్‌‌కు షాక్!
కేజీఎఫ్ రాఖీ భాయ్ స్టైల్‌తో ఆస్ట్రేలియాకు ఇచ్చిపడేసిన బవుమా..
కేజీఎఫ్ రాఖీ భాయ్ స్టైల్‌తో ఆస్ట్రేలియాకు ఇచ్చిపడేసిన బవుమా..