Manchi Rojulochayi Movie: మరోసారి నవ్వించడానికి సిద్ధం అవుతోన్న మారుతి..

విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ దానికి కావాల్సినంత కామెడీని జత చేసి హిట్స్ అందుకుంటున్నాడు దర్శకుడు మారుతి.

Manchi Rojulochayi Movie: మరోసారి నవ్వించడానికి సిద్ధం అవుతోన్న మారుతి..
Santhosh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2021 | 9:59 PM

Manchi Rojulochayi Movie: విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ.. దానికి కావాల్సినంత కామెడీని జత చేసి హిట్స్ అందుకుంటున్నాడు దర్శకుడు మారుతి. ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చివరగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండుగే సినిమాతో మంచి విజయం అందుకున్నారు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు మారుతి. సంతోష్ శోభన్ – మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా మంచి రోజులొచ్చాయి అనే సినిమా చేస్తున్నారు మారుతి. ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు సంతోష్ శోభన్. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక మంచి రోజులొచ్చాయి సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్- ఫస్ట్ లుక్ పోస్టర్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే ‘మంచి రోజులు వచ్చాయి’ క్యారక్టర్స్ ఇంట్రో లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

గత సినిమాల మాదిరిగానే మారుతి ఈ సినిమాతోనూ నవ్వించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ సినిమాలో స్టార్ కమెడియన్స్ అందరూ నటిస్తున్నారు. అజయ్ ఘోష్ – వెన్నెల కిషోర్ – శ్రీనివాస్ రెడ్డి – ప్రవీణ్ – సప్తగిరి – సుదర్శన్ – వైవా హర్ష – సత్యం రాజేష్ – శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులను ఈ ఇంట్రో లుక్ లో చూపించారు. ‘మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది.. ఆయన మీకు అంత దూరం అవుతారు’ అని సంతోష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మారుతి స్టైల్ లో ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Enemy Teaser: ఆకట్టుకొంటున్న ఎనిమీ మూవీ టీజర్.. యాక్షన్ పాకెడ్‌‌‌‌గా రానున్న మూవీ

Tollywood: ప్రజంట్ అడ్వంచరస్‌ టూర్‌లో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?

Pushpa Movie: ‘పుష్ప’ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన శ్రీతేజ్.. మరో లెవల్ అట..