Tollywood: ప్రజంట్ అడ్వంచరస్‌ టూర్‌లో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?

టాలీవుడ్‌లో కాంట్రవర్షియల్‌ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఏంటో చెప్పండి.. ఇప్పుడు ఆ హీరోనే మీకు పరిచయం చేయబోతున్నాం....

Tollywood: ప్రజంట్ అడ్వంచరస్‌ టూర్‌లో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?
Navdeep
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2021 | 9:16 PM

టాలీవుడ్‌లో కాంట్రవర్షియల్‌ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నవదీప్‌. సినిమాలతో కన్నా వివాదలతోనే ఎక్కువగా ఫేమస్ అయిన నవదీప్‌… ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా..? ఎక్కడుంటారు… అయితే ఏదో సినిమా సెట్‌లో ఉంటారు.. లేదంటో జిమ్‌లోనూ.. సీ స్పెస్‌ ఆఫీస్‌లోనూ ఉంటారు.. అనేగా మీ ఆన్సర్‌.. కాదండీ బాబూ… ప్రజెంట్ ఈ యంగ్ స్టార్ అడ్వంచరస్‌ టూర్‌లో ఉన్నారు. యస్‌… ప్రజెంట్ హిమాలయాస్‌లో మైనస్‌ డిగ్రీస్ టెంపరేచర్‌లో టూ వీలర్ మీద ట్రావెల్‌ చేస్తున్నారు నవ్‌దీప్‌. ఎప్పటికప్పుడు తన అడ్వంచరస్‌ ట్రిప్‌కు సంబంధించి ఫోటోస్‌… వీడియోస్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటునే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు జిమ్‌లో కండలు పెంచిన నవ్‌దీప్‌.. ఇప్పుడు హిమాలయాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

నవదీప్ 2004లో వచ్చిన “జై” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఆతర్వాత తెలుగు, తమిళ భాషలలో హీరోగా నటించిన ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, టీవీ షోలకు వ్యాఖ్యాతగా పరిమితమైపోయాడు. అందులో భాగంగా అల్లు అర్జున్ తాజా మూవీ అల వైకుంఠపురములోలలో ఓ మంచి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

నవ్‌దీప్ మాత్రమే కాదు బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అభిజిత్ కూడా ఆ మధ్య ఇలాంటి ట్రిప్‌కే వెళ్లొచ్చారు. థిక్‌ ఫారెస్ట్‌లో వైల్డ్ లైఫ్‌ ఫోటోగ్రఫి కోసం అభిజిత్ చేసిన రిస్కీ డ్రైవ్‌కు సంబంధించిన ఫోటోస్‌ వీడియోస్‌.. ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ అయ్యాయి.

Also Read:టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.

‘పుష్ప’ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన శ్రీతేజ్.. మరో లెవల్ అట..