Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకున్నారు .. దర్శకుడిపై నటి తీవ్ర ఆరోపణలు..

మలయాళ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధిఖీ నటి రేవతి సంపత్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె సంచలనం కామెంట్స్ చేసింది. దీంతో అతడు తన పదవికి రాజీనామా చేశాడు. అలాగే తాజాగా నటి మీను మునీర్ కూడా సిద్ధీఖిపై తీవ్ర ఆరోపణలు చేసింది. 2013లో ఓ సినిమా సెట్స్‌లో ముఖేష్, మణియంపిల రాజు, ఇద్వెల బాబు, జయసూర్య తనను శారీరకంగా, మాటలతో వేధించారని ఆమె పేర్కొంది.

Tollywood: బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకున్నారు .. దర్శకుడిపై నటి తీవ్ర ఆరోపణలు..
Minu Muneer
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2024 | 10:18 AM

సినీరంగుల ప్రపంచంలో నటీమణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఇటీవల హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు మలయాళీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. సీనియర్ నటులు, దర్శక నిర్మాతల పై కొందరు యాక్టర్స్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మలయాళ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధిఖీ నటి రేవతి సంపత్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె సంచలనం కామెంట్స్ చేసింది. దీంతో అతడు తన పదవికి రాజీనామా చేశాడు. అలాగే తాజాగా నటి మీను మునీర్ కూడా సిద్ధీఖిపై తీవ్ర ఆరోపణలు చేసింది. 2013లో ఓ సినిమా సెట్స్‌లో ముఖేష్, మణియంపిల రాజు, ఇద్వెల బాబు, జయసూర్య తనను శారీరకంగా, మాటలతో వేధించారని ఆమె పేర్కొంది.

మీను మునీర్ ఫేస్‌బుక్‌లో పెద్ద పోస్ట్ రాశారు. ఈ పోస్ట్‌లో “2013లో ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, ఈ వ్యక్తులు (ముఖేష్, మణియంపిల రాజు, ఇడవెల బాబు, జయసూర్య) నన్ను శారీరకంగా వేధించారు. అసభ్యకరమైన మాటలతో దుర్భాషలాడారు. నేను వారికి సహకరించి పని కొనసాగించడానికి ప్రయత్నించాను, కానీ వారి వేధింపులు భరించలేనంతగా మారాయి. నేను ఇప్పుడు ఆ గాయాలకు, అనుభవించిన బాధలకు న్యాయం కోరుతున్నాను. ఈ హేయమైన చర్యలపై చర్య తీసుకోవడానికి మీ సహాయాన్ని కోరుతున్నాను. వారి వేధింపుల కారణంగా మలయాళ చిత్ర పరిశ్రమను వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చింది. ‘కేరళ కౌముది’లో వచ్చిన కథనంలో ఈ దోపిడీకి వ్యతిరేకంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను ” అంటూ రాసుకోచ్చింది.

అలాగే మీను మునీర్ ఒక ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. “సినిమా షూటింగ్ సమయంలో నేను రెస్ట్ రూంకు వెళ్లాను. ఆ గది నుంచి బయటకు రాగానే నటుడు జయసూర్య నా అనుమతి లేకుండా నన్ను వెనుక నుంచి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను షాక్ అయ్యి పారిపోయాను” అంటూ చెప్పుకొచ్చింది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతమైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.