Bhola Shankar: మెగా ఫ్యాన్స్‏కు బిగ్ సర్ప్రైజ్.. భోళా శంకర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్ అప్డే్ట్స్ కూడా అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Bhola Shankar: మెగా ఫ్యాన్స్‏కు బిగ్ సర్ప్రైజ్.. భోళా శంకర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2023 | 3:12 PM

ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం చిరు నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్ అప్డే్ట్స్ కూడా అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ చిత్రంలో స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నామని.. అలాగే ఈ సీక్వెన్సీ ని అయితే ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యంలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై డైరెక్టర్ మెహర్ రమేశ్..ఫైట్స్ మాస్టర్స్ పై ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.