Tollywood: ‘మజిలీ’ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా ఉందో చూస్తే మెంటలెక్కిపోతారు

‘మజిలీ’ సినిమా 2019లో విడుదలై క్లాసిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా.. ప్రేక్షకుల్లో సామ్, చై జంటకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో నటించిన చిన్నారికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది.

Tollywood: ‘మజిలీ’ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా ఉందో చూస్తే మెంటలెక్కిపోతారు
Actress
Follow us

|

Updated on: Jun 17, 2024 | 9:52 PM

చైయ్, సామ్‌ కాంబోలో వచ్చిన సినిమాలకు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఏం మాయ చేశావోతో మొదలుకుని.. మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలు వీరు హీరోహీరోయిన్లుగా తెరకెక్కాయి. ఆటోనగర్ సూర్య బ్లాక్ బాస్టర్ అవ్వగా.. మిగతా అన్ని సినిమాలు సూపర్ హిట్స్. ముఖ్యంగా 2019లో వచ్చిన మజిలీ చిత్రం సూపర్ క్లాసికల్ హిట్‌గా నిలిచింది. కేవలం 20 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా దాదాపు 70 కోట్లు కొల్లగొట్టింది. నాగచైతన్య కెరీర్‌లోనే ఇవి టాప్ వసూళ్లుగా ట్రేడ్ పండితులు చెబుతుంటారు. ఈ సినిమాలోని . ‘ప్రియతమా ప్రియతమా‘, ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు’ పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చైతూ విరహ ప్రేమికుడిగా కనిపించగా.. శ్రావణి పాత్రలో నటించిన సమంత.. భర్త కోసం పరితపించిపోయే పాత్రలో జీవించింది.

ఈ సినిమాలో మీరా క్యారెక్టర్ కీ రోల్ పోషిస్తుంది. మీరా వచ్చాక మూవీ మొత్తం టర్న్ అవుతుంది. మీరా పాత్రలో నటించిన అమ్మాయి గుర్తింది కదా. తను ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అరె.. హీరోయిన్ మెటీరియల్ అని ప్రశంసిస్తారు. ఆ అమ్మాయి పేరు.. అనన్య అగర్వాల్. 2004లో ముంబైలో పుట్టిన అమ్మాయికి.. 20 ఏళ్లు వచ్చేశాయి. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నాలో టీవీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టింది అనన్య. అక్కడ పలు సీరియల్స్‌లో నటించింది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? క్యా హువా తేరా వాద, సియా కే రామ్, మహా భారత్, వంటి థారావాహికల్లో యాక్ట్ చేసింది. ఇవే కాకుండా యాడ్స్‌లో కూడా మెరిసింది.

కానీ తను సిల్వర్ స్క్రీన్‌పై కనిపించింది మాత్రం మజిలీ మూవీతోనే. ఈ సినిమాలో చైతూ మాజీ ప్రేయసి కుమార్తె భలే యాక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత ఏజ్ కారణంగా పూర్తి స్థాయిలో హీరోయిన్ అయ్యే అవకాశాలు దక్కలేదు. బుల్లితెరపైనే నటనను కంటిన్యూ చేసిన ఈ బ్యూటీ… సోషల్ మీడియాలో యమ బిజీగా మారిపోయింది. పలు రకాల బ్రాండ్స్ ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తోంది. త్వరలో ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.