Darshan : నటుడు దర్శన్ కు బిగుస్తున్న ఉచ్చు.. పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ రోల్‌పై పక్కా ఆధారాలు సేకరించారు బెంగళూరు పోలీసులు. లవర్‌ పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే కోపంతో తన అభిమాని రేణుకా స్వామిని దర్శన్‌ కిడ్నాప్‌ చేయించినట్టు తేలింది. రేణుకాస్వామి మర్డర్‌కు ముందు దర్శన్ పవిత్రతో కలిసి షెడ్డుకు వెళ్లిన సీసీ ఫూటేజీ కూడా చిక్కింది. పక్కా ప్లాన్ ప్రకారం రేణుకాస్వామిని.. పట్టెనగరిలోలని ఓ షెడ్‌కు తరలించారు. కాళ్లు చేతులు కట్టేసి కసిదీరా కొట్టారట.

Darshan : నటుడు దర్శన్ కు బిగుస్తున్న ఉచ్చు.. పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
Darshan
Follow us

|

Updated on: Jun 17, 2024 | 9:15 PM

ప్రియురాలి మోజులో అభిమానిని హత్య చేసిన కేసు దర్యాప్తులో హీరో దర్శన్‌ విలనిజాలు క్యూ కడుతున్నాయి.  భార్యా పిల్లలున్నా సరే భామాకలాపంతో చిక్కులు కొని తెచ్చుకున్న హీరో దర్శన్‌కు చట్టపరంగా ఉచ్చు బిగుస్తోంది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ రోల్‌పై పక్కా ఆధారాలు సేకరించారు బెంగళూరు పోలీసులు. లవర్‌ పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే కోపంతో తన అభిమాని రేణుకా స్వామిని దర్శన్‌ కిడ్నాప్‌ చేయించినట్టు తేలింది. రేణుకాస్వామి మర్డర్‌కు ముందు దర్శన్ పవిత్రతో కలిసి షెడ్డుకు వెళ్లిన సీసీ ఫూటేజీ కూడా చిక్కింది. పక్కా ప్లాన్ ప్రకారం రేణుకాస్వామిని.. పట్టెనగరిలోలని ఓ షెడ్‌కు తరలించారు. కాళ్లు చేతులు కట్టేసి కసిదీరా కొట్టారట. దర్శన్‌తో పవిత్ర కూడా కాలు చేయి చేసుకుందట, ఆయువు పట్టుపైన కొట్టడంతో రేణుకస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లినా సరే అతన్ని వదల్లేదట. కర్రలతో కొట్టి కరెంట్‌ కూడా ఇచ్చారట. పక్కా ఆధారాలు సేకరించారు పోలీసులు. చచ్చేట్టట్టు కొట్టడం కాదు చావాలనే కొట్టారనడానికి రేణుకస్వామి ఒంటిపై గాయాలే నిదర్శనం .

రేణుకాస్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత  డెడ్ బాడీని మురికి కాల్వలో పడేశారు. ఏం తెలియనట్టు పవిత్ర, దర్శన్ షూటింగ్‌కి వెళ్లారు. కార్తీక్, కేశవ్, నిఖిల్‌, రాఘవేంద్రలకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పడంతో వాళ్లు సరెండర్ అయ్యారు. కానీ..వీళ్లల్లో ఎవరికి క్రైమ్ బ్యాక్‌ గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది. అంతే.. తమ స్టైళ్లో ఇన్వెస్టిగేషన్  చేస్తే నిజాలు బయటపడ్డాయి. ఆరు రోజుల కస్టడీ ముగియడంతో  ఏ1 పవిత్ర, ఏ2 దర్శన్‌ను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. వారి విజ్ఞప్తి మేరకు ఆ ఇద్దరి కస్టడీని మరో ఐదురోజులకు పొడిగించింది కోర్టు.  రేణుకాస్వామిని బెదిరించి  భయపెట్టాలనుకున్నాం కానీ చంపాలనుకోలేదు.. ఎంక్వయిరీ ఫ్రేమ్‌లో   హీరో దర్శన్‌ సింగిల్ లైన్‌ డైలాగ్‌. ఎన్ని టేకులు తీసుకున్నా  సరే ఆ ఫ్రీక్వెన్సీ మాత్రం మారడంలేదట. మరోవైపు  విచారణలో  హీరో దర్శన్‌కు వీఐపీ రాచమర్యాదలు ఇస్తున్నారనే ఆరోపణలతో పాటు ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

రేణుకస్వామి మర్డర్‌ కేసుపై   కర్నాటకలోనే కాదు  దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై  సైలెంట్‌గా వున్నా  శాండిల్‌ వుడ్‌ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆవాజ్‌ విన్పిస్తోంది. రీసెంట్‌గా  నటి సంజనా   లేటెస్ట్‌ హీరో సుదీప్‌, ఉపేంద్ర   స్పందించారు.  మీడియాలో చూడ్డం వరకే అంతకు మించి తనకేం తెలియదన్నారు సుదీప్‌. దర్శన్‌ అరెస్ట్‌తో సినిమా ఇండస్ట్రీపై  నిందలు వేయడం సరికాదన్నారు. నేరం ఎవరు చేసి చట్టప్రకారం శిక్ష పడాల్సిందేనన్నారు. రేణుకా స్వామి  కుటుంబానికి న్యాయం చేయాలన్నారు సుదీప్‌.

ఛాలెంజింగ్‌ స్టార్‌గా ఎదిగిన దర్శన్‌  ఆది నుంచే కాంట్రావర్షియల్‌కు కేరాఫ్‌గా తన మార్క్‌ చాటుకున్నారు. భార్య విజయలక్ష్మితో గొడవ పడి దాడి చేసిన  ఘటనలో  గృహహింస కేసులో 14 రోజుల జైలుకెళ్ళాడు.  ఆ తరువాత రాజీమంత్రంతో వివాదం సద్దుమణిగింది. రాష్‌ డ్రైవింగ్‌ కేసులోనూ రాజీ మంత్రంతో గట్టెక్కాడు. ఓ హోటల్‌ను వెయిటర్‌పై  దాడి చేయడమే కాకుండా  ఆ విషయం బయటకు పొక్కకుండా సీసీ  టీవీ  విజువల్స్‌ మాయం చేశాడనే వివాదం చెలరేగింది.ఆ కేసులోనూ రాజీ బేరంతో  ఇమేజ్‌ డ్యామేజ్‌ కాకుండా చూసుకున్నాడంటారు. దర్శన్‌ దుందుడుకు చర్యలకు ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎంత డబ్బు ఎంత పలుకుబడి ఎంత స్టార్‌ డమ్‌ ఉంటేనేమ్‌.. అన్నిసార్లు ఫేమ్‌ అండ్‌ నేమ్‌ కాపాడవు. తప్పు చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. రేణుకాస్వామి మర్డర్‌ కేసులో పక్కా ఆధారాలతో  హీరో దర్శన్‌కు ఉచ్చు బిగుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles