Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ అప్డేట్.. నడుం బిగించి విలన్‌లా దుమ్ము దులపటానికి సిద్దమైన మహేష్..
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ హీరో పుట్టిన రోజు అంటే అది..
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ హీరో పుట్టిన రోజు అంటే అది అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇప్పటికే మహేష్ బర్త్ డేను వరల్డ్ వైడ్ ట్రెండ్ చేయాలనీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.అలాగే తన పుట్టిన రోజున అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు మహేష్. ఆగస్టు 9న మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట టీజర్ ను విడుదల చేయనున్నారు. ఉదయం తొమ్మిది గంటల.. తొమ్మిది నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మహేష్ అభిమానులు ఈ పోస్టర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఫస్ లుక్ పోస్టర్ తో రికార్డులు వేట మొదలు పెట్టింది సర్కారు వారి పాట. ఇక టీజర్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. తాజాగా ఈ సినిమా నుంచి చిన్న జిఫ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో నడుం బిగించి విలన్ల దుమ్ముదులపడానికి సిద్ధం అవుతున్నట్టు మహేష్ కనిపిస్తున్నాడు. ఈ గిఫ్ వీడియో సినిమా పై అంచనాలను మరింత పెంచింది.
బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. లాంగ్ హెయిర్, మెడమీద ట్యాటూతో ఆకట్టుకుంటున్నాడు మహేష్. భారీ బ్యాంక్ కుంభకోణంలో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు అదిరిపోయే కామెడీ కూడా ఉంటుందని తెలుస్తోంది.
Block your calendars and lock your plans ?
Let’s Begin the SuperStar Birthday Extravaganza ?#SuperStarBirthdayBLASTER on AUG 9th @ 9:09 AM ?
? https://t.co/jX9HqqaQiF #SarkaruVaariPaata ? @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @KeerthyOfficial @madhie1 pic.twitter.com/w6H9ZkjJji
— Mythri Movie Makers (@MythriOfficial) August 7, 2021
మరిన్ని ఇక్కడ చదవండి