Mahesh Babu: జక్కన్న పాన్ వరల్డ్ స్కెచ్ అదిరింది.. మహేష్ సినిమా ఎన్ని దేశాల్లో రిలీజ్ కానుందో తెలుసా?
మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ మూవీతో ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లేలా జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం మహేష్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. అంటే భారత దేశంలో తెరకెక్కిన సినిమాల్లో కెల్లా ఇదే హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం.ఇటీవలే హైదరాబాద్, రాజస్థాన్ లలో ఈ మూవీక సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీ కరించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి కెన్యా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.
కెన్యాలోని దట్టమైన అడవులు, వన్యప్రాణుల మధ్య మహేష్ బాబు సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటోంది. ఇప్పటికే కెన్యా షూటింగ్ షెడ్యూల్ తుది దశకు వచ్చిందని సమాచారం. కాగా రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో కాకుండా పాన్-వరల్డ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీషులోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కి పైగా దేశాలలో ఒకేసారి మహేష్ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అంటే ప్రపంచంలోని మూడో వంతు దేశాల్లో ఈ మూవీ విడుదల కానుందన్నమాట.
మొట్ట మొదటి భారతీయ సినిమాగా..
#SSMB29 First Proper Global Film of Indian Cinema. Scheduled to release in 120 countries. The #MaheshBabu starrer is expected to reach Billions viewers worldwide pic.twitter.com/ZKIPNyoeTd
— Box Office (@Box_Office_BO) September 2, 2025
గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా పలు దేశాల్లో రిలీజయ్యాయి. అయితే ఇప్పుడు మహేష్ మూవీ తో రాజమౌళి మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించనున్నాడు. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు.అలాగే ప్రముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ‘ఇండియానా జోన్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాల తరహాలో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది.
An Exclusive Update –
𝗗𝗶𝘀𝗻𝗲𝘆 𝗮𝗻𝗱 𝗦𝗼𝗻𝘆 𝗣𝗶𝗰𝘁𝘂𝗿𝗲𝘀 are Officially in talks to Distribute #SSMB29 into International Market with Multiple Language Dub versions 🤯🔥
More Over #SSRajamouli is Planning to Dub Over 20+ Languages Worldwide.#MaheshBabu #GlobeTrotter pic.twitter.com/klHpWBq0SN
— Censor Reports (@tolly_censor__) September 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








