Mahesh Babu: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేష్ స్టామినా.. నయా రికార్డు క్రియేట్ చేసిన ఒక్కడు
అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ను ఒక్కడు సినిమా మాస్ హీరోగా మార్చేసింది. ఇక ఈ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యింది. కొత్త ఏడాది పురస్కరించుకొని ఒక్కడు సినిమాను జనవరి 7న రిలీజ్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు గురించి ఎంత చెప్పిన తక్కువే.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మహేష్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ మూవీ. అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ను ఒక్కడు సినిమా మాస్ హీరోగా మార్చేసింది. ఇక రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యింది ఒక్కడు. కొత్త ఏడాది పురస్కరించుకొని ఒక్కడు సినిమాను జనవరి 7న రిలీజ్ అయ్యింది. సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఇప్పటికి అదే క్రేజ్ ఉంది ఈ మూవీ. తాజాగా రీ రిలీజ్ ఆయన ఒక్కడు మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. ఒక్కడు సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేశారు. కొత్త సినిమాకు చేసినంత హడావిడి చేశారు ఫ్యాన్స్.
ఇక ఈ సినిమా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మరోసారి మహేష్ స్టామినా ఏంటో చూపించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ ఒక్కడు నయా రికార్డ్ సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ ఒక్కడు సినిమా 16.93 లక్షలు ఒక్కరోజులో కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.
మహేష్ సరసన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కబడీ ప్లేయర్ గా కనిపించాడు. విలన్ గా ప్రకాష్ రాజ్ అదరగొట్టారు. గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమాకోసం తోట తరణి వేసిన చార్మినార్ సెట్ హాట్ టాపిక్ అయ్యింది.



