Mahesh Babu: మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన మహేశ్‌ బాబు.. రెండేళ్ల పిల్లాడికి ఉచితంగా గుండె ఆపరేషన్

ఇప్పటికే శ్రీమంతుడిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నాడు మహేశ్‌. అలాగే గుండె జబ్బులతో బాధపడుతోన్న ఎందరో చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు.

Mahesh Babu: మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన మహేశ్‌ బాబు.. రెండేళ్ల పిల్లాడికి ఉచితంగా గుండె ఆపరేషన్
Mahesh Babu Foundation
Follow us
Basha Shek

|

Updated on: May 29, 2023 | 3:15 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోగా మహేశ్‌ బాబుకు పేరుంది. అయితే అందమైన రూపంతో పాటు అంతకన్నా మంచి మనసు ఈ టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సొంతం. ఓ వైపు సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న మహేశ్‌.. మరోవైపు తన వంతు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నాడు మహేశ్‌. అలాగే గుండె జబ్బులతో బాధపడుతోన్న ఎందరో చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు. తాజాగా మరో చిన్నారి గుండెకు ప్రాణం పోశాడు మహేశ్‌. తన ఫౌండేషన్‌ ఆధ్వర్యలో రెండేళ్ల బాలుడికి ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేయించింది. ఈ విషయాన్ని మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా చిన్నారికి ఉచితంగా చికిత్స అందజేసిన మహేశ్‌, నమ్రత దంపతులకు ధన్యవాదాలు తెలిపారు పిల్లాడి తల్లిదండ్రులు.

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన రెండేళ్ల కార్తికేయ అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హాస్పటల్‌కు వెళ్లగా గుండెలో హోల్‌ ఉందని వైద్యులు నిర్ధారించారు. పేదరికంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీకి గుండె ఆపరేషన్‌ చేయించడం భారంగా మారింది. అప్పుడే కొందరి ద్వారా మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ గురించి తెలుసుకున్నారు. తాజాగా బాలుడికి ఉచితంగా హార్ట్‌ సర్జరీ చేసి డిశ్చార్జ్‌ చేసినట్లు పిల్లాడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు ఫౌండేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పేరెంట్స్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మహేశ్‌- నమ్రతలపై ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..