AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ అడుగుజాడల్లోనే గౌతమ్.. లండన్‌లో నాటకం వేసిన ఘట్టమనేని వారసుడు .. ఫొటోలు షేర్ చేసిన నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తండ్రి అడుగుజాడల్లోనే నడవనున్నాడు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించాడు గౌతమ్. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి సారించాడు.

Mahesh Babu: మహేష్ అడుగుజాడల్లోనే గౌతమ్.. లండన్‌లో నాటకం వేసిన ఘట్టమనేని వారసుడు .. ఫొటోలు షేర్ చేసిన నమ్రత
Mahesh Babu Family
Basha Shek
|

Updated on: Jun 23, 2024 | 9:26 AM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తండ్రి అడుగుజాడల్లోనే నడవనున్నాడు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే చిన్న వయసులో మహేశ్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించాడు గౌతమ్. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి సారించాడు. రీసెంట్‌గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అదే సమయంలో గౌతమ్ లండన్ లో యాక్టింగ్ కోర్సులు చేస్తున్నాడని సమాచారం. ఇప్పుడిదే లండన్ వేదికగా మొదటి స్టేజి ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు గౌతమ్. రోమియో జూలియట్ నాటకం వేశాడీ స్టార్ కిడ్. ప్రస్తుతం మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార కూడా లండన్ లోనే ఉన్నారు. వీరి సమక్షంలోనే గౌతమ్ రోమియో జూలియట్ నాటకం వేసినట్లు తెలుస్తోంది. నాటకం అయిపోయిన తర్వాత థియేటర్ బయట దిగిన ఫోటోలను నమ్రతా షేర్ చేసింది. అలాగే ఒక ఎమోషనల్ కోట్ రాసుకొచ్చింది ‘బ్యూటిఫుల్ ఈవెనింగ్. లండన్ లో గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. నా కుమారుడు మరింత బాగా చేసాడు. పిల్లలు అందరూ ఈ సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కు కచ్చితంగా రావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదా సాయంత్రాన్ని గడిపాను అని పోస్ట్ చేసింది నమ్రత.

ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన పోస్ట్, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మహేశ్ లాగే గౌతమ్ సూపర్ స్టార్ అవుతాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహేశ్ గారాల పట్టి సితార కూడా సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు ప్రకటనల్లోనూ మెరిసిందీ స్టార్ కిడ్. మొత్తానికి మహేష్ వారసులిద్దరూ సినిమాల్లోకి రావడం ఖాయం అని తెలుస్తుంది. దీనిపై మహేష్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో బిజీగా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. అలాగే జిమ్ లోనే ఎక్కువగా కనిపిస్తూ వర్కవుట్లు చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

లండన్ లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫొటోలు ఇవిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.