Mahesh Babu: జక్కన్న మాస్టర్ ప్లాన్.. రెండు పార్టులుగా మహేష్ బాబు సినిమా ?..

ప్రస్తుతం ఆయన మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరిలో రాబోయే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాను గ్లోబల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్‏లో ఈ సినిమా ఉండబోతుందని.. ఇప్పటికే మహేష్ న్యూలుక్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను చేయబోతున్నారట రాజమౌళి.

Mahesh Babu: జక్కన్న మాస్టర్ ప్లాన్.. రెండు పార్టులుగా మహేష్ బాబు సినిమా ?..
Mahesh Babu, Rajamouli
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Nov 18, 2023 | 5:53 PM

ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్నే ఫిదా చేశారు డైరెక్టర్ రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది. జక్కన్న టేకింగ్, స్క్రీన్ ప్లే పై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరిలో రాబోయే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాను గ్లోబల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్‏లో ఈ సినిమా ఉండబోతుందని.. ఇప్పటికే మహేష్ న్యూలుక్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను చేయబోతున్నారట రాజమౌళి. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఫిల్మ్ సర్కిల్లో అనేక రూమర్స్ వైరలవుతుంటాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2 పార్టులుగా తీసుకురాబోతున్నారట జక్కన్న. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని.. మొదటి పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ కి పైగా స్టోరీని ల్యాగ్ చేయకుండా స్క్రీన్ ప్లేతోనే రెండు భాగాలుగా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ తెగ నడుస్తోంది. ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న సలార్, దేవర చిత్రాలు రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ సినిమా సైతం వచ్చి చేరిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల గురూజీ బర్త్ డే సందర్భంగా విడుదలైన ధమ్ మసాలా సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023