Keerthy Suresh: చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా పదేళ్ల సినీ ప్రయాణం.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..
రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో హీరోయిన్ సావిత్రి పాత్రలో నటించి ఏకంగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది కీర్తి. చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా కనిపించింది.

బాలనటిగా తెరంగేట్రం చేసి ఇప్పుడు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది కీర్తి సురేష్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఆ తర్వాత 2013లో గీతాంజలి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. అయితే రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో హీరోయిన్ సావిత్రి పాత్రలో నటించి ఏకంగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది కీర్తి. చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా కనిపించింది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకుంది కీర్తి. ఈ సందర్భంగా తన ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
ఆ వీడియోలో తన తండ్రికి, తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్నాళ్లూ తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను కథానాయికగా పరిచయం చేసిన దర్శకుడు ప్రియదర్శన్ తన గురువు అని తెలిపారు. కథానాయికగా తనకు నిరంతం మద్దతు తెలుపుతున్న అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇకపై ప్రేక్షకులను మరింత అలరిస్తానని తెలిపింది. తన సినిమా ప్రయాణం ఇప్పుడే మొదలైందనిపిస్తుందని.. అప్పుడే పదేళ్లు గడిచిపోయాయంటూ ఎమోషనల్ అయ్యింది కీర్తి. తనను కథానాయికగా ఇన్నాళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఎలప్పుడు తనపై ప్రేమ, సపోర్ట్ ఉండాలంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ తొలినాళ్లలో మంచి రివ్యూస్ వచ్చాయని.. ఆ తర్వాత ఎన్నో మీమ్స్, ట్రోల్స్ జరిగాయని.. కానీ వారందరికీ కృతజ్ఞతలు అంటూ వీడియోను ముగించింది కీర్తి.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. కీర్తి చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. రఘు దత్తా, రివాల్వర్ రీటా, కన్నీవేది సినిమాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కీర్తి ఓ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




