AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli-Virat Kohli: ‘రికార్డ్స్ ఉన్నవే బద్దలు కొట్టడానికి’.. విరాట్ కోహ్లీ సెంచరీ పై ఎన్టీఆర్, రాజమౌళి ప్రశంసలు..

ఇన్నాళ్లు క్రికెట్‏లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‏గా సచిన్ మొదటి స్థానంలో ఉన్నారు. 452 ఇన్నింగ్స్ లో 49 శతకాలు సాధించిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు సచిన్. అయితే ఇప్పుడు సచిన్ రికార్డ్స్ బద్దలు కొట్టేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు మొత్తం 49 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈరోజు జరిగిన న్యూజిలాండ్, భారత్ మ్యాచ్‏లో మరో శకతం పూర్తిచేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేశారు. కోహ్లీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడంతో కింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియంలో సందడి చేశారు.

SS Rajamouli-Virat Kohli: 'రికార్డ్స్ ఉన్నవే బద్దలు కొట్టడానికి'.. విరాట్ కోహ్లీ సెంచరీ పై  ఎన్టీఆర్, రాజమౌళి ప్రశంసలు..
Rajamouli, Ntr, Venkatesh,
Rajitha Chanti
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 6:02 PM

Share

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్ ముంబైలోని వాఖండే స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు క్రికెట్‏లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‏గా సచిన్ మొదటి స్థానంలో ఉన్నారు. 452 ఇన్నింగ్స్ లో 49 శతకాలు సాధించిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు సచిన్. అయితే ఇప్పుడు సచిన్ రికార్డ్స్ బద్దలు కొట్టేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు మొత్తం 49 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈరోజు జరిగిన న్యూజిలాండ్, భారత్ మ్యాచ్‏లో మరో శకతం పూర్తిచేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేశారు. కోహ్లీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడంతో కింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియంలో సందడి చేశారు. ఈ మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ సినీతారలతోపాటు.. సచిన్ సైతం స్టేడియంలో సందడి చేశారు. తన రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీని అభినందిస్తూ చప్పట్లు కొడుతూ కనిపించారు సచిన్.

ఇక కోహ్లీ సెంచరీ చేయడంపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు స్టార్స్. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ‘రికార్డ్స్ ఉన్నదే బద్దలు కొట్టడానికి.. కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

రాజమౌళి ట్వీట్..

అలాగే ఎన్టీఆర్ స్పందిస్తూ.. “49 వన్డే సెంచరీలు. ఇది తిరుగులేని రికార్డు. దీనిని ఇండియాలో ఒక భారతీయుడు బ్రేక్ చేశాడు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో దీని కంటే మెరుగైనది మరొకటి లేదు. కంగ్రాట్స్ కోహ్లీ. మీరు 50 స్టాండింగ్ ఒవేషన్‌లు…మరిన్నింటికి అర్హులు” అంటూ ట్వీట్ చేశాడు తారక్.

ఎన్టీఆర్ ట్వీట్..

ఇక ఇప్పటికే వాఖండే స్టేడియంలో సందడి చేసిన వెంకటేశ్.. కోహ్లీ సెంచరీపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, మిథాలీ రాజ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.

వెంకటేశ్ ట్వీట్..

సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. 

మిథాలీ రాజ్ ట్వీట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.