AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mark Antony: హీరో విశాల్‌కు షాక్‌.. ‘మార్క్‌ ఆంటోనీ’ రిలీజుపై మద్రాస్‌ హైకోర్టు స్టే.. కారణమేంటంటే?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతను తాజాగా నటిస్తోన్న ‘మార్క్ ఆంటోని’ సినిమా విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న 'మార్క్ ఆంటోని' సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హఠాత్తుగా సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. ఒక ఫైనాన్స్‌ వ్యవహారానికి సంబంధించిన కేసును విచారించిన కోర్టు మార్క్‌ ఆంటోనీ రిలీజుపై స్టే విధించింది.

Mark Antony: హీరో విశాల్‌కు షాక్‌.. 'మార్క్‌ ఆంటోనీ' రిలీజుపై మద్రాస్‌ హైకోర్టు స్టే.. కారణమేంటంటే?
Mark Antony Movie
Basha Shek
|

Updated on: Sep 09, 2023 | 6:13 PM

Share

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతను తాజాగా నటిస్తోన్న ‘మార్క్ ఆంటోని’ సినిమా విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ‘మార్క్ ఆంటోని’ సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హఠాత్తుగా సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. ఒక ఫైనాన్స్‌ వ్యవహారానికి సంబంధించిన కేసును విచారించిన కోర్టు మార్క్‌ ఆంటోనీ రిలీజుపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నటుడు విశాల్‌పై కేసు నమోదు చేసింది. లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ 21.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. 15 కోట్లను నిర్ణీత గడువులోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే విశాల్ 15 కోట్లు చెల్లించకపోవడంతో ఇప్పుడు ‘మార్క్ ఆంటోని’ సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. అంతేకాదు సెప్టెంబర్ 12న విశాల్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సెప్టెంబర్ 15న ఇతర తమిళ సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ‘మార్క్ ఆంటోని’ని సోలోగా విడుదల చేయాలని భావించారు మేకర్స్‌. దీంతో సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయని భావించారు. అయితే కోర్టు ఆదేశాలతో చివరి క్షణంలో చిత్ర బృందం ప్లాన్‌ రివర్స్‌ అయింది. సెప్టెంబర్ 15లోగా విశాల్ 15 కోట్లు చెల్లిస్తే కోర్టు విధించిన స్టే ఎత్తివేసే అవకాశం ఉంది.

కాగా విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ విషయంలో విభేదాలు ఉన్నాయి. గోపురం సినిమా చేయడానికి ఫిలింస్టోకు చెందిన అన్బుచెలియన్ నుండి 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు విశాల్‌. దీనిని నిర్మాణ సంస్థ లైకా చెల్లించింది. అయితే విశాల్ లైకాకు డబ్బు తిరిగి ఇవ్వలేదు. పైగా ఇచ్చిన హామీలు, అగ్రిమెంట్లను కూడా విశాల్ ఉల్లంఘించాడు. దీంతో లైకా కోర్టును ఆశ్రయించింది నిర్ణీత గడువులోగా 15 కోట్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే విశాల్ ఆ మొత్తాన్ని ఇవ్వలేదు. ‘మార్క్ ఆంటోని’ సినిమాలో విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య కూడా నటించాడు. రీతూ వర్మ ఈ సినిమాలో కథానాయిక. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. టైమ్‌ ట్రావెల్‌కు సైన్స్‌ ఫిక్షన్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కామెడీ కూడా క్లిక్ కావడంతో ఈ సినిమాపై చిత్రబృందం చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా పడడంతో చిక్కుల్లో పడింది .

ఇవి కూడా చదవండి

మార్క్‌ ఆంటోనీ తెలుగు ట్రైలర్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!