Thangalaan – Kanguva: చిక్కుల్లో తంగలాన్, కంగువ సినిమాలు.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..

చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్ ' ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉండగా, విడుదలకు కొద్దిరోజుల ముందే ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఇదిలా ఉంటే నటుడు సూర్య నటించిన కోట్లాది బడ్జెట్ మూవీ కంగువ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ సినిమా విడుదల కూడా సందిగ్ధంలో పడింది.

Thangalaan - Kanguva: చిక్కుల్లో తంగలాన్, కంగువ సినిమాలు.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..
Thangalaan And Kanguva
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2024 | 7:18 AM

ఇద్దరు తమిళ భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే స్టార్ హీరో సూర్య కంగువ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు చిక్కుల్లో పడ్డాయని తెలుస్తోంది. చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్ ‘ ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉండగా, విడుదలకు కొద్దిరోజుల ముందే ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఇదిలా ఉంటే నటుడు సూర్య నటించిన కోట్లాది బడ్జెట్ మూవీ కంగువ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ సినిమా విడుదల కూడా సందిగ్ధంలో పడింది. సినిమా విడుదల కావాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మద్రాసు కోర్టు ఆదేశించింది.

‘తంగలాన్’, ‘కంగువ’ సినిమాల నిర్మాత కెఇ జ్ఞానవేలు ఓ వ్యాపారవేత్తకు రూ.కోట్లు బకాయిపడినట్లు ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టులో ఈ కేసును విచారిస్తుంది.  2011లో అర్జున్ లాల్ సుందరదాస్ ఓ సినిమా నిర్మాణం కోసం జ్ఞానవేలు గ్రీన్ స్టూడియోకి 12.85 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ సినిమా నిర్మాణం సగంలో ఆగిపోవడంతో కేవలం 2.5 కోట్లు మాత్రమే అర్జున్ లాల్ సుందర్ దాస్ కి తిరిగి ఇచ్చి 10.35 కోట్లు బ్యాలెన్స్ ఉంచారు. అర్జున్ లాల్ సుందర్‌దాస్ మరణించిన తర్వాత, అతని కుటుంబం గ్రీన్ స్టూడియోస్‌పై కేసు వేసింది.

అయితే కేసు గురించి జ్ఞానవేలు మాట్లాడుతూ, అర్జున్ లాల్ సుందర్‌దాస్ ఇంతకు ముందు అతను నిర్మించిన మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులను ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ. 12.85  ఇచ్చాడు. అంతే తప్ప తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు అని చెప్పారు. కానీ దానికి సంబంధించి ఒక జిరాక్స్‌ను మాత్రమే కోర్టుకు డాక్యుమెంట్‌గా ఇచ్చారు. 2015 వరదల్లో అసలు రికార్డు ధ్వంసమైంది అని తెలిపాడు. వాస్తవానికి, అప్పటి గ్రీన్ స్టూడియో కార్యాలయం రెండవ అంతస్తులో ఉంది. ఆ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు ఏవీ వరదలో పోలేదని తరువాత నిర్ధారించబడింది. కాగా గ్రీన్ స్టూడియోస్ బకాయి ఉన్న రూ.10.25 కోట్లను 18% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం దావా వేసింది. ఈ కేసును విచారించిన కోర్టు గ్రీన్ స్టూడియోస్ నేరం చేసినట్లుగా గమనించి, ఏదైనా సినిమా విడుదలకు ముందు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!