MAA Elections 2021: హేమ నా చెయ్యి కొరికింది బాబోయ్.. శివ బాలాజీ గగ్గోలు..

మా ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. ఇరు ప్యానల్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాట చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రంలో

MAA Elections 2021: హేమ నా చెయ్యి కొరికింది బాబోయ్.. శివ బాలాజీ గగ్గోలు..
Hema
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 10, 2021 | 11:30 AM

మా ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. ఇరు ప్యానల్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాట చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రంలో నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై మంచు విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రంలో లేని నటీనటుల పేర్లతో ఓట్లు వేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్‌ ఆరోపణలు చేసింది. అలాగే మోహన్ బాబు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సెంటర్‌లో ప్రచారం చేయడానికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైలాగ్ కింగ్. బెనర్జీని చంపేస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై సినీ నటుడు నరేష్ స్పందించారు. పోలింగ్ బూత్‏లో ఎలాంటి గోడవలు జరగడం లేదని..తప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఎవరో ఒకరు ప్రకాష్ రాజ్ బ్యాడ్జ్ వేసుకుని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నేను, ప్రకాష్ రాజ్ కౌగిలించుకున్నాం. నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్ అని చెప్పుకొచ్చారు. అలాగే శివబాలాజీని హేమ గారు కొరిగారు అంటూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. అయితే ఓ వైపు గొడవలు కావడం లేదంటూనే మరోవైపు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం.. శివబాలాజీని హేమ కొరికిందని చెప్పడం గమనార్హం.

ఇంతకీ మా ఎన్నికల పోలింగ్ బూత్‏లో అసలేం జరుగుతుంది. సీనియర్లు ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు.. ఇక మీదట ఇలాంటి పరిస్థితులు జరగకుండా చూసుకుంటాం అని చెప్పగా.. మరోవైపు ఇతర నటీనటులు మాత్రం ఇరు ప్యానల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇలాంటి వార్తలు బయటకు రావడంతో.. వెంటనే ఇరు ప్యానళ్లకు సంబంధించిన సభ్యులు, అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ సైతం గొడవలు జరగడం లేదని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద మా ఎన్నికలు మాత్రం రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయని నటి రోజా చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మా ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలను మోహన్ బాబు సీరియస్‏గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల అనంతరం సిని’మా’ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడున్న సందేహం.

Also Read: MAA Elections 2021: మా ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాం: వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

MAA Elections 2021: మీడియాపై ఫన్నీ కామెంట్స్ చేసిన చిరంజీవి.. మంచి మెటిరియల్ దొరికిందంటూ చమత్కారం..