MAA Elections 2021: మీడియాపై ఫన్నీ కామెంట్స్ చేసిన చిరంజీవి.. మంచి మెటిరియల్ దొరికిందంటూ చమత్కారం..
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ప్రకాష్ రాజ్,
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ల మధ్య మాటల యుద్ధ కొనసాగుతుంది. మరోవైపు ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు.. వాగ్వాదాలు జరగడం కామన్ అంటున్నారు సినీ పెద్దలు. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే.. మెగాస్టార్ చిరంజివీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మా ఎన్నికల వలన మీడియాకు మంచి మెటిరియల్ దొరికిందంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
చిరంజీవి మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని మెగాస్టార్ అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. మీ మీడియాకు మంచి మెటిరియల్ దొరికింది కదా.. ఈ పరిస్థితిలో ఆనంద పడాలి కదా. అని చమత్కరించారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని చెప్పుకొచ్చారు.
ఓటు హక్కు వినియోగించుకున్న నటి రోజా.. వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి వాతవారణంలో ఎన్నిక జరుగుతుండడం ఆనందంగా ఉంది. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అందరం కలిసి కట్టుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మన సమస్యలను పరిష్కరించేలా ముందుకు వెళ్లాలని రోజా తెలిపారు. రెండు ప్యానెళ్లలో నాతో పనిచేసిన వారు ఉన్నారు. కానీ ఎక్కువ సమయం ఎవరు ఆర్టిస్ట్‌లకోసం పనిచేస్తారో దాన్ని బట్టే ఓటు వేస్తారు. కరోనా సమయంలో ఎక్కువ నష్టపోయింది ఇండస్ట్రీలో ఉన్న వారే. మళ్లీ పూర్వ వైభవం రావాలి, ప్రేక్షకుల అభిమానం పొందేలా కలిసి పనిచేయాలని. వెనక నుంచి పక్కన నుంచి మాట్లాడేవారి వల్లే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మా అసోసియేషన్‌ను ఇంకా అభివృద్ధి చేస్తారంటూ రోజా చెప్పుకొచ్చారు. మా అధ్యక్ష ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరని రోజా స్పష్టం చేశారు.
ఓటు వేసిన జెనీలియా.. మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేంద్రానికి నటి జెనిలీయా చేరకున్నారు. ఈ సందర్భంగా విష్ణు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి జెనిలీయాను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడున్న వారిని జెనీలియా పలకరిస్తూ లొపలికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: MAA Elections 2021: మా ఎన్నికల్లో గందరగోళం.. ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య మరోసారి మాటల యుద్ధం..
MAA Elections 2021: పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్, బాలయ్య.. ఎవరు గెలుస్తారని చెప్పారంటే..