MAA Elections 2021: మా ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాం: వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతున్నారు. ఎన్నికలకు ముందుగానే..
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతున్నారు. ఎన్నికలకు ముందుగానే మూడు ప్లటూన్ల బలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రం వద్ద మోహరించారు. పోలింగ్‌లో గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారు. ఇక మా ఎన్నికల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన టీవీ9తో మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు ఓట్లు వేసేందుకు రావడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారని, లోపల ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సాయంత్రం 4గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ఇందు కోసం ముందస్తుగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ మేరకు ప్రకాష్ రాజ్ గన్ మెన్ లను లోపలకి అనుమతించలేదని, ఇరువర్గాలు లోపల ప్రచారం చేసుకోకుండా ఉండేందుకు పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. ఎన్నికల పోలింగ్‌లో చిన్నపాటి ఘర్షణలు తలెత్తాయని, పోలీసు సిబ్బందితో వెంటనే సద్దుమణిగేలా చేశామని అన్నారు. ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
పోలింగ్ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రంలో లేని నటీనటుల పేర్లతో ఓట్లు వేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్ ఆరోపణలు చేసింది. ఈ విషయమై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ తీరును తప్పుబట్టారు నరేష్. అయితే ఇదిలా ఉంటే.. రిగ్గింగ్ జరుగుతోంది, సభ్యులు దాడికి దిగుతున్నారు .