MAA Elections 2021 ‘మా’ సభ్యులు వ్యక్తిగతంగా దూషించుకోవడం బాధాకరం: ఎమ్మెల్యే రోజా
MAA Elections 2021: 'మా' ఎన్నికల్లో పోలింగ్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను.
MAA Elections 2021: ‘మా’ ఎన్నికల్లో పోలింగ్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోన్న పరిస్థితి. సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించే విధంగా మా అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక నగరి ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సారి కొనసాగుతున్న ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఉందని అన్నారు. ‘మా’ సభ్యులు వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారని, ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఘర్షణలు పడటం చాలా బాధాకరమని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఉన్నది 900 మంది మాత్రమే. అందరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లము. రెండు ప్యానల్లో నాతో పని చేసిన వారు, తెలిసిన వారు ఉన్నారు. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నా. సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. చివరికి అందరం కలిసి కట్టుగా ఉండి మన సమస్యలను పరిస్కరించుకునే విధంగా ముందుకు వెళ్లాలి. కళాకారులకు, ఆర్టిస్ట్‌లుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. గతంలోని పాలకవర్గంలో పెద్దవారిని, గోప్ప నటులను ఆదర్శంగా తీసుకుని సినీ పరిశ్రమను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.. అని రోజా వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా ప్రశాంతగా పోలింగ్ కొనసాగించాలని కోరుతున్నానని అన్నారు.
View this post on Instagram