Chandrabose: నన్ను ఎక్కువగా ఏడిపించిన పాట అదే.. వింటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు.. చంద్రబోస్..
కొన్ని పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరికొన్ని పాటల్లో గుండెల్లో లోతుల్లో దాగిన బాధను బయటకు తీసుకువస్తాయి. బాధను, సంతోషాన్ని బయటపెట్టి.. చిన్నపిల్లల మారి గంతులేసే పాటలు ఉన్నాయి. అయితే ఇప్పటికే వందలాది పాటలు రాసిన రచయితను ఒక పాట ఇప్పటికీ కన్నీళ్లు పెట్టిస్తుందట.

లిరిసిస్ట్ చంద్రబోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీరంగంలో దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పటికీ మనసును తాకే చరణాలను అందిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలంగాణలోని పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని చల్లగరిగ అనే తన స్వగ్రామంలోని శాఖ గ్రంథాలయం తనపై చూపిన ప్రభావాన్ని బయటపెట్టారు. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బుజ్జాయి వంటి బాలసాహిత్య పత్రికలు తన భాషా సంపదను, సొగసైన వాక్య నిర్మాణాన్ని, ఊహాశక్తిని పెంచాయని అన్నారు. గాయకుడిగా తన తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత, మిత్రుడు శ్రీనాథ్ ప్రోత్సాహంతో రచనా రంగంపై దృష్టి సారించి, 1995లో తాజ్ మహల్ చిత్రంలోని “మంచుకొండల్లోన చంద్రమా” పాటతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేసుకున్నారు. 28 సంవత్సరాలలో 850 చిత్రాలకు పైగా 3600 పాటలు రాసిన తన ప్రయాణంలో నిరంతర అధ్యయనం, పెద్దల ఆశీర్వాదం కీలకమని చంద్రబోస్ తెలియజేశారు.
యన బాల్యం తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని చల్లగరిగ అనే చిన్న గ్రామంలో గడిచింది. తన ఇంటి పక్కనే ఉన్న గ్రంథాలయం, దేవాలయం తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన స్మరించుకున్నారు. గ్రంథాలయంలో చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర, యోజన, ప్రజ్ఞ, విస్డమ్, చంపక్ వంటి బాలసాహిత్య పత్రికలను క్రమం తప్పకుండా చదివేవారని, అది తన రచనా జీవితానికి బలమైన పునాది వేసిందని చంద్రబోస్ పేర్కొన్నారు. చంద్రబోస్ తన మొట్టమొదటి పాటను పాఠశాలలో తన సైన్స్ టీచర్ ప్రకాష్ రెడ్డి వీడ్కోలు సందర్భంగా రాశారు. మొదట్లో గాయకుడిగా మారాలని ప్రయత్నించినా, మిత్రుడు శ్రీనాథ్ సలహాతో రచనా రంగం వైపు మళ్లారు. 1995లో తాజ్ మహల్ చిత్రంలోని “మంచుకొండల్లోన చంద్రమా” పాటతో సినీ గేయ రచయితగా అరంగేట్రం చేశారు. ఈ పాట రచన అనుభవం, దానిపై శ్రీలేఖ అందించిన ట్యూన్, దివంగత ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రశంసలను గుర్తు చేసుకున్నారు. శాస్త్రి , వెన్నెలకంటి , భువనచంద్ర వంటి మహామహులు తనను ఆశీర్వదించారని, భువనచంద్ర గారు తనను “పూర్వజన్మలో వాల్మీకి” అని కొనియాడారని చంద్రబోస్ తెలియజేశారు. ఈ ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ఆదరణ తన 28 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానానికి (850 చిత్రాలు, 3600+ పాటలు) చోదకశక్తిగా నిలిచాయని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా పేర్కొన్నారు.
అలాగే రామ్ చరణ్ నటించిన రంగస్థలంలోని ఓరయ్యో సాంగ్ వింటూ కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ పాట తనను ఎంతో ఏడిపించిందని.. ఈ పాట ప్లే చేయగానే సెట్ లోని ప్రతి ఆర్టిస్ట్ భావోద్వేగానికి గురయ్యారని గుర్తుచేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..
