ఆ ఒక్క యుద్ధనౌక చాలు.. ఇరాన్ పని ఖతమేనా?
అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు, మరిన్ని యుద్ధనౌకలు మధ్యప్రాచ్యానికి కదులుతున్నాయి. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ఇప్పటికే చేరుకుంది. ఇరాన్‌లో అంతర్గత అల్లర్లు, ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు ఘర్షణ భయాలను పెంచాయి. అమెరికా దాడికి ప్లాన్ చేస్తోందని, ఇది ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ రాజకీయ ప్రయోజనాలు కూడా దీని వెనుక ఉన్నాయి.
అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపుగా కదులుతున్నాయని వాటిని ఉపయోగించే అవసరం రాకూడదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకుంది. మరిన్ని యుద్ధనౌకల గురించి ట్రంప్ చేసిన కామెంట్లు ఉద్రిక్తతను మరింతగా పెంచాయి. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడి ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక..అమెరికా యుద్ధ నౌకలు పశ్చిమాసియా దిశగా కదిలి వస్తుండటంతో ఇరాన్‌పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చనే భయాలు వ్యాప్తి అవుతున్నాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అక్కడి భద్రతా దళాలు ముందుజాగ్రత్తగా బంకర్ లోకి తరలించినట్లు సమాచారం. అయితే.. 86 సంవత్సరాల ఖమేనీ కూడా.. ఆయుధం ట్రిగర్ మీద తమ వేలు ఉందని హూంకరించారు. అయితే.. ఇరాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, దేశంలో అంతర్గత అల్లర్ల నేపథ్యంలో యుద్ధమే వస్తే.. ఇరాన్ కోలుకోని రీతిలో దెబ్బతినక తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇరాన్‌లో ఇదే సరైన టైమ్ అని భావిస్తున్న అమెరికా యుద్ధానికి భారీ ప్లాన్ చేసుకొంది. అమెరికా నావికాదళం భారీ ఆర్మడా మిడిల్ ఈస్ట్ వైపు వెళ్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే ప్రకటించారు. ఈ నావికా దళంలో అబ్రహం లింకన్ అనే పెద్ద యుద్ధ నౌక ఉంది. అనేక యుద్ద విమానాలను మోసుకుని ఇరాన్ తీరంలో ఈ నౌక రెడీగా ఉంది. ఆ యుద్ధ నౌకపై గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ కూడా ఉన్నాయి. ఆ ఒక్క యుద్ధ నౌక చాలు.. ఇరాన్ పని అయిపోవడానికి. అంత పవర్‌ఫుల్ అది. నిజానికి ఇరాన్ ఒకప్పుడు పవర్‌ఫుల్ దేశమే. కానీ అదే ట్రంప్ ఇరాన్‌పై ఆంక్షలు పెట్టి ప్రపంచ దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనకుండా చేశారు. ఇండియా కూడా మానేసింది. దాంతో ఇరాన్ ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు అంతర్గత కల్లోలం మామూలుగా లేదు. ప్రజలు ప్రాణాలు పోయినా పర్లేదంటూ ఆందోళనలు చేస్తూ ఖమేనీపై తిరగబడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తన సొంత దేశంలో గ్రాఫ్ పడిపోతోంది. త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. వాటిలో తన పార్టీని నెగ్గించుకోవాలంటే నిరంతరం మీడియా అటెన్షన్ క్రియేట్ చేస్తూ మాగా నినాదాన్ని వినిపిస్తూ స్థానికతను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వెనెజులా వెన్ను విరిచేసిన ట్రంప్ ప్పుడు ఇరాన్ పై పడ్డారు. అంటే ఏ క్షణమైనా వార్ మొదలవ్వడం ఖాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..

