ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
అసోంకు చెందిన జంతు ప్రేమికుడు బిపిన్ తన ఏనుగు పిల్ల ప్రియాన్షి అలియాస్ 'మోమో' పుట్టినరోజును ఘనంగా జరిపాడు. పండ్లు, ధాన్యాలతో చేసిన కేక్ కట్ చేయించి, ప్రత్యేక మెనూతో వేడుక నిర్వహించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, బిపిన్, మోమో మధ్య అద్భుత అనుబంధాన్ని చాటి చెప్పింది. నెటిజన్లు ఆప్యాయతను చూసి ముగ్ధులవుతున్నారు.
జంతువులపై తమ ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చాటుకుంటారు. కొందరు వాటికి ఆహారం పెడితే, మరికొందరు వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అసోంకు చెందిన ఓ జంతు ప్రేమికుడు ఒక అడుగు ముందుకేసి, తాను పెంచుకుంటున్న ఏనుగు పిల్ల పుట్టినరోజును ఘనంగా జరిపాడు. ప్రియాన్షి అలియాస్ ‘మోమో’ అని పిలుచుకునే ఈ ఏనుగు పిల్ల బర్త్‌డే వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంతు ప్రేమికుడు ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ మూగజీవిపై ఆయన చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నెటిజన్ల హృదయాలను కదిలించింది. ప్రియాన్షి కోసం ప్రత్యేకంగా పండ్లు, ధాన్యాలతో అలంకరించిన నీలి రంగు కేక్‌ను కట్ చేయించారు. పుట్టినరోజు మెనూలో భాగంగా అరటిపండ్లు, యాపిల్స్, ద్రాక్ష, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేశారు. బిపిన్, ప్రియాన్షి మధ్య ఉన్న అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏనుగు పిల్ల క్యూట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ, “జంతువులను ప్రేమించే వారంటే నాకు చాలా ఇష్టం.. మోమోకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని కామెంట్ చేశాడు. ఈ జీవాలను ప్రేమిస్తున్నందుకు లవ్ యూ బ్రదర్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అని ఇంకొకరు రాశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది
Srisailam: భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..

