ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా గొంతులో మటన్ బొక్క ఇరుక్కుని ప్రాణాపాయ స్థితికి చేరారు. శ్వాస ఆడకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాకతీయ గ్యాస్ట్రో ఆస్పత్రిలో డాక్టర్ నవీన్ ఆడెపు ఎండోస్కోపీ ద్వారా బొక్కను విజయవంతంగా తొలగించి ప్రాణాలు కాపాడారు. సకాలంలో అందిన వైద్యం వల్ల ప్రాణనష్టం తప్పింది.
నాన్‌వెజ్ ప్రియులకు మటన్, చికెన్ తో బోజనం అంటే పండగే. ఎంతో ఇష్టంగా ఆవురావురంటూ తింటారు. అలా ఎంతో ఇష్టంగా మటన్ కూరతో భోజనం చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. రాత్రి మటన్ కర్రీతో భోజనం చేస్తుండగా బొక్క గొంతులో ఇరుక్కుపోయింది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బారావు పల్లి గ్రామానికి చెందిన టి.శ్రీనివాస అనే వ్యక్తి మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగా గొంతులో మటన్ బొక్క ఇరుక్కుపోయింది. శ్వాస ఆడకపోవడంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు శ్రీనివాస్. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితున్ని చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యుడు నవీన్ ఆడెపు.. శ్రీనివాస్ కు వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కున్న మటన్ బొక్క ను జాగ్రత్తగా తొలగించాడు. ప్రాణాపాయం నుండి శ్రీనివాస్ క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మటన్ బొక్క ఎంత పని చేససింది అంటూ స్థానికులు చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.99/- కే టికెట్…! హిట్టు కొట్టేందుకు మనోడి నయా స్ట్రాటజీ
TOP 5 ET: ఇక NTR విషయంలో జాగ్రత్త !! తారక్‌కు కోర్టు రక్షణ !!
Upasana: మెగా ట్విన్ బేబీస్ ఆహ్వానానికి ప్రత్యేక ఏర్పాట్లు
అర్ధరాత్రి నటితో అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగింది ??
TG Vishwa Prasad: పాపం విశ్వ ప్రసాద్ !! ’15 సినిమాలు తీస్తే.. రెండే హిట్టు
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం

