AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025లో బెస్ట్‌ సెల్లింగ్‌ ఫోన్‌ ఏదో తెలుసా? ఎందుకు అంత ఎగబడి కొన్నారంటే..?

2025లో ఐఫోన్ 16 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 విడుదలైప్పటికీ, సరసమైన ధర, అద్భుతమైన పనితీరు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, మరియు ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఐఫోన్ 16 అమ్మకాలు దూసుకుపోయాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

2025లో బెస్ట్‌ సెల్లింగ్‌ ఫోన్‌ ఏదో తెలుసా? ఎందుకు అంత ఎగబడి కొన్నారంటే..?
Iphone 16 Sales 2025
SN Pasha
|

Updated on: Jan 30, 2026 | 6:04 PM

Share

బెస్ట్‌ సెల్లింగ్‌ ఫోన్‌ అనగానే.. చాలా మంది మిడ్‌ రేంజ్‌ ప్రైజ్‌ ఉన్న ఫోన్‌ అని అనుకొని ఉంటారు. కానీ 2025లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌ ఏదో తెలుసా యాపిల్‌ ఐఫోన్‌ 16. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నుండి ఇటీవలి నివేదిక ప్రకారం ఐఫోన్ 16 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. యాపిల్, శామ్‌సంగ్ కలిసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 19 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం మార్కెట్లో ఈ రెండు కంపెనీలు అత్యధిక వాటా కలిగి ఉండటం ఇది వరుసగా నాలుగో ఏడాది. ఇక ఫోన్‌ మోడల్స్‌ విషయానికి వస్తే.. మొత్తం 10 టాప్‌ సెల్లింగ్‌ ఫోన్స్‌లో యాపిల్‌ పది స్థానాల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. ఐఫోన్ 16 అగ్రస్థానంలో ఉంది. శామ్‌సంగ్ మిగిలిన మూడు స్థానాలను భర్తీ చేసింది.

విచిత్రమేమిటంటే యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 2025లో లాంచ్ చేసింది. ఆ ఫోన్‌లు కూడా బాగానే అమ్ముడైంది. కానీ ఐఫోన్ 16 ను మాత్రం దాటలేకపోయింది. ఇప్పటికీ ఐఫోన్ 16 టాప్‌ గేర్‌లో దూసుకెళ్తోంది. దీని ధర ఇండియాలో రూ.69,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 రిలీజ్‌ అయిన మొదటి 3 నెలల్లో ఐఫోన్ 16 కంటే 16 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. కానీ ఆ తర్వాత ఐఫోన్‌ 16 తన క్రేజ్‌ను నిలబెట్టుకుంది.

ఐఫోన్ 16 క్రేజ్‌కి కారణాలు

  • ధర.. ఐఫోన్ 16 ప్రీమియం లుక్‌తో సరసమైన ధర దానికి అమ్మకాలకు ప్రధాన కారణం. ప్రో మోడల్స్, ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్‌ల ధర చాలా ఎక్కువ. అదనంగా ఫెస్టివల్‌ డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ ఆఫర్‌లు, క్యారియర్ డీల్‌లతో చాలా మంది ఈ ఫోన్‌ను కొన్నారు.
  • పనితీరు. A18 చిప్‌తో iPhone 16 ఏమాత్రం తగ్గదు. గేమ్‌లు, ఫోటోలు, స్ట్రీమింగ్, వర్క్ యాప్‌లు ఎన్ని వాడినా అద్భతంగా పనిచేస్తుంది.
  • అప్డేట్లు.. ఐఫోన్‌ల గురించి అత్యుత్తమ విషయాలలో ఒకటి వాటి హ్యాండ్‌సెట్‌లకు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతు ట్రాక్ రికార్డ్. ఐఫోన్ 16 రాబోయే సంవత్సరాల్లో iOS అప్డేట్లు, సెక్యూరిటీ పరిష్కారాలను పొందుతూనే ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వినియోగానికి అనువైనదిగా చేస్తుంది.
  • ఐఫోన్‌కి ఉన్న క్రేజ్‌.. iMessage, FaceTime, iCloud, AirPods, Apple Watch వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. మీరు పాత iPhone వాడుతున్నట్లయితే iPhone 16 ఇప్పటికీ భారీ ఖర్చు లేకుండా ఒక సూపర్‌ అప్‌గ్రేడ్ లాగా అనిపిస్తుంది. అలాగే చాలా మందికి ఐఫోన్ వాడాలనే క్రేజ్‌ కూడా ఈ ఫోన్‌ అమ్మకాలకు కారణం.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి