AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్‌ భయమేనా ??

కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్‌ భయమేనా ??

Phani CH
|

Updated on: Jan 30, 2026 | 5:34 PM

Share

పశ్చిమ బెంగాల్‌లో నిపా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో, థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయాలు, సరిహద్దుల్లో కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిపాకు చికిత్స లేదా వ్యాక్సిన్ లేకపోవడం, అధిక మరణాల రేటుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. భారత్ మాత్రం బెంగాల్‌లో పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేసింది.

బెంగాల్‌లో నిపా వైరస్ కేసులు వెలుగుచూసాయి. థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్ దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలు చేస్తున్నాయి. బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ విమానాశ్రయంలో జనవరి 25 నుంచి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ప్రయాణికులు ఆరోగ్య సమాచారాన్ని తెలిపే ఫారాలను నింపాల్సి ఉంటుంది. జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. ఇదే తరహా చర్యలను నేపాల్ ప్రభుత్వం ఖాట్మండు విమానాశ్రయంతో పాటు భారత్‌తో ఉన్న సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కూడా ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నిపా వైరస్ మరణాల రేటు 40 నుంచి 75 శాతం వరకు ఉండటం, దీనికి నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో స్వల్ప సంఖ్యలో కేసులు నమోదైనా ఆ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తైవాన్ కూడా నిపా వైరస్‌ను అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో చేర్చింది. పశ్చిమ బెంగాల్‌లో డిసెంబర్ 2025 నుంచి ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిపా సోకినట్లు జనవరి 13న అధికారికంగా నిర్ధారించారు. ఈ రెండు కేసులకు సంబంధించి 196 మందిని గుర్తించి పరీక్షించగా, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 27న ఒక ప్రకటనలో తెలిపింది. మీడియాలో వస్తున్న అధిక సంఖ్య కేసుల వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. బెంగాల్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఇప్పటివరకు కేవలం రెండు కేసులే నమోదయ్యాయని భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు

ఆ ఒక్క యుద్ధనౌక చాలు.. ఇరాన్‌ పని ఖతమేనా?

పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా

తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల