కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
సాధారణంగా కొబ్బరి కాయలను మనుషులు కోస్తారు. కానీ, ఒక అరుదైన వీడియోలో ఒక వానరం కొబ్బరి చెట్టెక్కి ఎంతో నైపుణ్యంతో కాయలను దింపుతీస్తోంది. రైతులాగే కాయల నాణ్యతను పరిశీలించి మరీ కోయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది, నవ్వులు పూయిస్తోంది.
సాధారణంగా కొబ్బరి తోటలో చెట్ల పైనుంచి కొబ్బరి కాయలు దించాలంటే ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. గ్రామాల్లో కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దించడానికి ప్రత్యేకంగా కొందరు ఉంటారు. వారు నెలకోసారి తోటలో కొబ్బరిచెట్టెక్కి బాగా అయిన కాయలను నాణ్యత చూసి ఆ తరువాత కొబ్బరికాయల దింపుతీస్తారు. ఇదంతా ఓకే.. ఒక వానరం కొబ్బరికాయలను దింపుతీయడం ఎక్కడైనా చూశారా? ఓ కోతి కొబ్బరి చెట్టుఎక్కి చకచకా కొబ్బరికాయలు దింపు తీసేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కొబ్బరి తోటలో చెట్టుపైకి ఎక్కింది ఓ వానరం. చెట్టునిండా కొబ్బరికాయల గెలలు ఉన్నాయి. ఎంతో నైపుణ్యం రైతులా చెట్టుపైకి ఎక్కి కాయ నాణ్యత చూసి మరీ కొబ్బరి కాయలు తెంచుతోంది ఆ వానరం. కొబ్బరికాయల నాణ్యత చెక్ చేయడంలో తనకు తానే సాటి.. లేరు తనకు పోటీ అన్నట్టుగా కాయలు తెంచుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. కోతే గానీ…మహా ముదురు అంటూ నవ్వుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్ భయమేనా ??
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
ఆ ఒక్క యుద్ధనౌక చాలు.. ఇరాన్ పని ఖతమేనా?
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

