AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నన్ను త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లకు పరిచయం చేసింది ఆ హీరోనే..

తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు విజయవాడకు చెందిన అజయ్. విలన్, హీరో ఫ్రెండ్‌గా, పోలీస్ ఆఫీసర్ ఆయన చేసిన రోల్స్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఇండస్ట్రీలో అజాత శత్రువుగా అజయ్‌కు పేరుంది. అయితే అజయ్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిన హీరో ఎవరంటే..?

Tollywood: నన్ను త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లకు పరిచయం చేసింది ఆ హీరోనే..
Actor Ajay
Ram Naramaneni
|

Updated on: Jan 30, 2026 | 5:35 PM

Share

నటుడు అజయ్ తన సినీ ప్రయాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని, ఆయన అందించిన సపోర్ట్‌ను పంచుకున్నారు. ఒక్కడు చిత్రం తర్వాత తన కెరీర్‌ను మహేష్ బాబు ఒక మలుపు తిప్పారని అజయ్ వెల్లడించారు. అతడు చిత్రంలో ఒక పాత్రకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను, పోకిరి చిత్రంలో మరో పాత్రకు పూరి జగన్నాథ్‌ను మహేష్ బాబే తనకు పరిచయం చేశారని తెలిపారు. సాధారణంగా మహేష్ బాబు ఇతర నటులను రికమెండ్ చేయడం చాలా అరుదు అని అజయ్ పేర్కొన్నారు. కానీ, తనను పరిచయం చేసి, మంచి నటుడని దర్శకులకు చెప్పారని వివరించారు.

ఇటీవలే అజిత్ ఓ సినిమా షూటింగ్ సమయంలో సెట్‌కి వెళ్లి మహేష్ బాబును కలిసినప్పుడు.. ఆయన తన నటనను చూసి ప్రశంసించారని అజయ్ గుర్తు చేసుకున్నారు. “తునివు చూశాను, చాలా బాగుంది, చాలా బాగా చేశావ్” అని మహేష్ బాబు అభినందించారని తెలిపారు. మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ ఎలాంటి అవసరం లేకుండా, తన నటనను గుర్తుంచుకుని ప్రశంసించడం చాలా గొప్ప విషయమని అజయ్ వ్యాఖ్యానించారు. నచ్చిన విషయాన్ని సూటిగా చెప్పే స్వభావం మహేష్ బాబుదని, ఇలాంటి సంఘటనలు తన కెరీర్‌లో ఎన్నో ఉన్నాయని నటుడు అజయ్ పేర్కొన్నారు.

Mahesh Babu

Mahesh Babu

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..