AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Susheela: హమ్మయ్యా.. ఆస్పత్రి నుంచి సింగర్ సుశీల డిశ్చార్జ్.. ఆ వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి

ప్రముఖ సినీ గాయని పి సుశీల ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతోన్న సుశీలమ్మకు సడెన్ గా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు

Susheela: హమ్మయ్యా.. ఆస్పత్రి నుంచి సింగర్ సుశీల డిశ్చార్జ్.. ఆ వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి
Singer P Susheela
Basha Shek
|

Updated on: Aug 20, 2024 | 7:35 AM

Share

ప్రముఖ సినీ గాయని పి సుశీల ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతోన్న సుశీలమ్మకు సడెన్ గా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించారు. ఇది సాధారణ కడుపు నొప్పేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అటు కుటుంబ సభ్యులు కూడా సుశీలమ్మ ఆరోగ్యంపై స్పందించారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. కాగా పరిస్థితి కుదుట పడడంతో ఈ లెజెండరీ సింగర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోమవారం (ఆగస్టు 19) ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సుశీలమ్మే స్వయంగా ఒక ప్రకటన రూపంలో తెలియజేశారు. అదే సమయంలో తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తోన్నవదంతులను నమ్మవద్దని ఆమె అభిమానులను కోరారు. ‘నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. డిశ్చార్జి అయ్యి ఇంటికి కూడా వచ్చాను. అభిమానులు ఆశీర్వాద బలమే నన్ను కాపాడింది’ అని ప్రకటనలో తెలియజేశారు సుశీలమ్మ.

కాగా తన ఆరోగ్య పరిస్థితిపై సుశీలమ్మే స్వయంగా ప్రకటన విడుదల చేయడంతో అభిమానులు, సంగీత ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. తేనె కన్నా తీయనైన గానంతో సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు సుశీల. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషల్లో 40 వేలకుపైగా పాటలను ఆలపించారు. తన గాన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డు, పద్మభూషన్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అయితే వయసు రీత్యా గత కొంత కాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా వయో సంబంధిత సమస్యలతో కనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..