AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viraji OTT: అప్పుడే ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. విరాజి స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న హీరో వరుణ్ సందేశ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే 'నింద' సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. గతంలో కంటే ఎంతో భిన్నంగా ఈ సినిమాలో కనిపించాడు వరుణ్ సందేశ్. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ వెంటనే విరాజి అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ముందుకొచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో.

Viraji OTT: అప్పుడే ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. విరాజి స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Viraji Movie
Basha Shek
|

Updated on: Aug 20, 2024 | 8:09 AM

Share

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న హీరో వరుణ్ సందేశ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘నింద’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. గతంలో కంటే ఎంతో భిన్నంగా ఈ సినిమాలో కనిపించాడు వరుణ్ సందేశ్. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ వెంటనే విరాజి అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ముందుకొచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. ఆద్యంత్ హర్ష తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ప్రమోదిని, రఘు కారు మంచి ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 02న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆండీ పాత్రలో గతంలో కంటే ఎంతో డిఫరెంట్ గా కనిపించాడు వరుణ్ సందేశ్. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన విరాజి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 22 నుంచి విరాజి సినిమాను స్ట్రీమింగ్ క తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘చుట్టూ పిచ్చి ప్రపంచం. బయటపడతాడా? భయపెడతాడా?’ అంటూసోషల్ మీడియాలో విరాజి సినిమా పోస్టర్ ను కూడా షేర్ చేసింది. కాగా థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన విరాజి సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వరుణ్ సందేశ్. అలాగే బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలినీ పులపా,ప్రసాద్ బెహరా తదితరులు తమ పాత్రలతో మెప్పించారు. ఇక విరాజి సినిమా కథ విషయానికి వస్తే.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోని రీతిలో కొందరు యువకులు ఆ ఆస్పత్రికి వెళ్తారు. అదే సమయంలో ఆండీ (వరుణ్ సందేశ్) రాకతో వాళ్ల జీవితాల్లో ఊహించని మార్పలు చోటు చేసుకుంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే విరాజి సినిమాను చూడాల్సిందే.

ఆగస్టు 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు