Lata Mangeshkar: గానకోకిల లతా మంగేష్కర్ చివరి కోరిక తీర్చిన కుటుంబ సభ్యులు..

లతామంగేష్కర్ 20 భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు ఆలపించారు . మధురమైన ఆమె గాత్రం తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపు 980   పైగా సినిమాల్లో లతామంగేష్కర్ పాటలు పాడారు. ఆమె గానానికి ''క్వీన్ ఆఫ్ మెలోడీ", "నైటింగేల్ ఆఫ్ ఇండియా" అలాగే "వాయిస్ ఆఫ్ ది మిలీనియం" అనే బిరుదులను సొంతం చేసుకున్నారు లతాజీ. 1989లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది .ఆమె మరణంతో సంగీత లోకం ఒక్కసారిగా మూగబోయింది.

Lata Mangeshkar: గానకోకిల లతా మంగేష్కర్ చివరి కోరిక తీర్చిన కుటుంబ సభ్యులు..
Lata Mangeskar
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 12:19 PM

లెజెండ్రీ సింగర్ లతామంగేష్కర్ మనల్ని వదిలి వెళ్ళిపోయినా ఆమె పాటలు ఎప్పటికి శాశ్వతంగా ఉంటూ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. 2022  ఫిబ్రవరి 6న లతాజీ కన్నుమూశారు. లతామంగేష్కర్ 20 భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు ఆలపించారు . మధురమైన ఆమె గాత్రం తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపు 980   పైగా సినిమాల్లో లతామంగేష్కర్ పాటలు పాడారు. ఆమె గానానికి ”క్వీన్ ఆఫ్ మెలోడీ”, “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అలాగే “వాయిస్ ఆఫ్ ది మిలీనియం” అనే బిరుదులను సొంతం చేసుకున్నారు లతాజీ. 1989లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది. ఆమె మరణంతో సంగీత లోకం ఒక్కసారిగా మూగబోయింది. లతాజీ మరణాన్ని ఇప్పటికి ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక ఆమె చివరి కోరికను కుటుంబసభ్యులు తాజాగా నెరవేర్చారు. చివరి రోజుల్లో లతాజీ తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వాలని అనుకున్నారు. ఈమేరకు ఆమె తన విల్లులో కూడా రాసుకున్నారు. ఆమె కోరిక మేరకు లతా మంగేష్కర్ తరఫున ఆమె కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.10 లక్షల రుణాపాయాలను విరాళంగా అందజేసింది.

లతా జీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తురాలు. గతంలో ఆమె ఎన్నో అద్భుతమైన పాటలని , కీర్తనలను స్వామి వారికోసం అలరించారు కూడా. ఒకానొక సాయంలో ఆమె శ్రీవారి ఆస్థాన గాయినిగాను చేశారు. ఇక ఇప్పుడు ఆమె చివరి కోరిక లతా మంగేష్కర్ తరఫున రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు టీటీడీకి లేఖ రాశారు. ఆమె సోదరి ఉషా మంగేష్కర్ టీటీడీ బోర్డు సభ్యుడు మిలింద్ కేశవ్ నర్వేకర్ ను లతాజీ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వాలని కోరారు.

లతా మంగేష్కర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

లతా మంగేష్కర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

లతా మంగేష్కర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.