AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయనది మాములు స్పీడ్ కాదు.. ఒకే ఏడాదిలో ఆ హీరోవి 23 సినిమాలు రిలీజ్ అయ్యేవి..

కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్. ఆయన టచ్ చేయని జోనర్ లేదు. విభిన్న ప్రయోగాలు చేసి.. మంచి సక్సెస్ అందుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు కోడి రామకృష్ణ. అలాగే అరుంధతి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు.

ఆయనది మాములు స్పీడ్ కాదు.. ఒకే ఏడాదిలో ఆ హీరోవి 23 సినిమాలు రిలీజ్ అయ్యేవి..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2026 | 2:37 PM

Share

కోడి రామకృష్ణ పేరు తెలియని సగటు తెలుగు సీనీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం ఉండదు. భక్తి ప్రధాన చిత్రాలకు తనదైన గ్రాఫిక్స్‌ సొబగులు అద్ది ఆ కాలంలోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాకు దర్శకత్వం వహించి గొప్ప పేరు సంపాదించుకున్నారాయన. అరుంధతి సినిమాతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకర్షించారు కోడి రామకృష్ణ. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు కోడి రామకృష్ణ. గతంలో కోడి రామకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆయన తన గురువు దాసరి నారాయణరావు నుంచి కష్టపడేతత్వం, నిర్మాతలకు ఇచ్చే గౌరవం వంటివి నేర్చుకున్నానని కోడి రామకృష్ణ తెలిపారు. డ్రామాను సహజంగా చూపించడంలో దాసరి గారు దిట్ట అని కోడిరామకృష్ణ అన్నారు.

రెండే రెండు సినిమాలు.. ఒకటి హిట్ రెండోది డిజాస్టర్..! ఒకోక్క మూవీకి రూ.7కోట్లు అందుకుంటున్న బ్యూటీ

దాసరి నారాయణరావు గారు నిద్రపోవడం ఎప్పుడూ చూడలేదని, 24 గంటలు సినిమా ఆలోచనలతోనే గడిపేవారని కోడి రామకృష్ణ వివరించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయన ఇంటి దగ్గర తమకు చర్చలు ఉండేవని, ఆరు గంటలకు మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యేదని తెలిపారు. దాసరి గారి ఇంటి దగ్గర ఎప్పుడూ కార్లు ఉండటం వల్ల ఆ వీధికి “నిత్య కళ్యాణం పచ్చ తోరణం రోడ్డు” అని పేరు వచ్చిందని, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలు కూడా మేకప్ వేసుకుని, తమ డైరీలలో డేట్స్ నోట్ చేసుకోవడానికి దాసరి గారి ఇంటికి వచ్చేవారని కోడి రామకృష్ణ తెలిపారు.

నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు

తాను దాసరి గారికి అత్యంత ఇష్టమైన శిష్యులలో ఒకడినని కోడి రామకృష్ణ తెలిపారు.. లెజెండరీ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ పనితీరును కోడి రామకృష్ణ కొనియాడారు. కృష్ణ గారు చాలా వేగంగా పని చేసేవారని, కృష్ణ నటించిన సినిమాలు ఒకే సంవత్సరంలో 23 విడుదలయ్యేవని, ఆయన ఏకంగా మూడు షిఫ్ట్ లు పని చేసేవారని కోడిరామకృష్ణ తెలిపారు. అలాగే దాసరి గారి కృష్ణకు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన కథలోని కొర్ పాయింట్ ను చెప్పే విధానం భలే ఉంటుందని. ఆ మెయిన్ పాయింట్ ను విని కృష్ణగారు తెలివిగా కథను ఒకే చేసేవారని కోడిరామకృష్ణ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

Krishna

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..